రాప్తాడులో హోరాహోరీ – బీజేపీ మద్దతుతో కూటమి అభ్యర్థికి అడ్వాంటేజ్ ?

అనంతపురం జిల్లా రాప్తాడులో హోరాహోరీ పోరు సాగుతోంది. రాప్తాడు అంటే పరిటాల ఫ్యామిలీ కంచుకోట. అయితే గత ఎన్నికల్లో జగన్ వేవ్ లో అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల కంచుకోటలన్నీ కూలిపోయాయి. పరిటాల సునీత ఓడిపోయారు. అయినా నియోజకవర్గాన్ని అంటి పెట్టుకునే ఉన్నారు. ప్రజలకు భరోసాగానే ఉన్నారు. దీంతో పరిటాల ఫ్యామిలీకి ఇబ్బంది లేకుండా టిక్కెట్ దక్కింది.

పనులు చేయించలేకపోయిన ఎమ్మెల్యే తోపుదుర్తి

పరిటాల సునీత ఎప్పుడు గెలిచినా.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడల్లా నియోజకవర్గంలో పనులు జరిగేవి. కానీ గత ఐదేళ్లుగా పరిస్థితి దిగజారింది. ప్రభుత్వం మారితే మా పరిస్థితేమిటని భయపడేలా వైసీపీ నేతలు ఉన్నారు. కొంత మంది టీడీపీలో చేరిపోతున్నారు. చేరికలు భారీగా పెరగడం దానికి నిదర్శనం. గత ఎన్నికల్లో ఓటమి పాలైన సానుభూతి, అధికార పార్టీపై వ్యతిరేకత , రాప్తాడులో అభివృద్ది కార్యక్రమాలు జరగకపోవడం వంటివి సునీతకు సానుకూలాంశాలుగా కనిపిస్తున్నాయి. తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరులు, అనుచరుల అక్రమాలను పరిటాల సునీత ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు.

రోడ్లు వేస్తానని సవాల్ చేసి నెరవేర్చలేకపోయిన వైసీపీ ెమ్మెల్యే
రాప్తాడులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడంలేదని స్వయంగా ప్రకాష్ రెడ్డే ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. గత డిసెంబరులో ప్రకాష్‌రెడ్డి మీడియా ముందుకొచ్చి మాట్లాడుతూ నియోజకవర్గానికి తాను ఎంతో చేయాలనుకున్నానని ఏమీ చేయలేకపోయానని వ్యాఖ్యానించారు. అందుకు తన మీద తనకే చాలా అసంతృప్తిగా ఉందన్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా రాప్తాడు నియోజకవర్గంలో 100 రోజుల్లో రోడ్ల నిర్మాణం పూర్తిచేస్తామని రోడ్లు పూర్తి చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని సవాల్ చేశారు. కానీ రోడ్లు కాదు కదా.. మట్టి కూడా తోలించలేకపోయారు. తమ సొంత గ్రామానికి 5 ఏళ్లు రోడ్డు వేయలేకపోయారని ప్రజల్లోనూ అసంతృప్తి కనిపిస్తోది.

కలసి రానున్న జనసేన, బీజేపీ ఓట్లు

జనసేనతో పొత్తు కూడా తమకు ప్లస్ అవుతుందని టీడీపీ శ్రేణులు ధీమాతో ఉన్నాయి. గతంలో బీజేపీకి సాలిడ్ గా ఐదు వేల ఓట్ల బ్యాంక్ ఉండేది. ఈ ఓట్లన్ని ఈ సారి కూటమి అభ్యర్థులకు పడతాయి. అదే విజయంపై ప్రధాన నమ్మకంగా టీడీపీ అభ్యర్థి ఉన్నారు. బలిజ ఓటర్లుకూడా ఉండటంతో.. జనసేన మద్దతు కూడా కలసి వస్తుందని లెక్కలేసుకుంటున్నారు.