సమ్మర్లో బయటకు వెళ్లేటప్పుడు ఇవన్నీ మీ దగ్గర ఉంటే మంచిది!

వాటర్ బాటిల్
అన్నటికన్నా చాలా ముఖ్యమైనది వాటర్ బాటిల్. సమ్మర్లో బయట అడుగుపెడితే తప్పనిసరిగా మంచినీళ్లుండాలి. దాహం వేసినప్పుడు ఆ దగ్గర్లో నీరు లేక అవస్థలు పడాల్సి ఉంటుంది..అందుకే మీ బ్యాగ్ లో తప్పనిసరిగా వాటర్ బాటిల్ ఉండాలి.

మాస్క్
మాస్క్ కేవలం దుమ్ము ధూళి నుంచి, వైరస్ నుంచి మాత్రమే కాదు ఎండ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఎండ తీవ్రత మీపై నేరుగా ప్రభావం చూపించకుండా మాస్క్ ఉపయోగపడుతుంది. కేవలం ముక్కు,నోరు మాత్రమే కాదు ముఖం మొత్తం కవర్ చేసే మాస్క్ వినియోగించడం మంచిది.

శానిటైజర్
వైరస్ వచ్చినప్పుడే కాదు శానిటైజర్ వినియోగం ఎప్పుడైనా మంచిదే. పైగా సమ్మర్లో అరచేతుల్లోనూ చెమట పట్టేస్తుంది..క్రిములుంటాయి. అందుకే ఏం తినాలన్నా తాగాలన్నా ఓసారి శానిటైజ్ చేసుకోవడం మంచిది.

పెర్ఫ్యూమ్ / డియోడరెంట్
ఎంత ఫ్రెష్ గా రెడీ అయ్యి వెళ్ళినా బయటకి వెళ్ళే సరికి స్నానం చేసినట్టు మారిపోతారు. చెమట వాసన పక్కనున్నవాళ్లని చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ పరిస్థితి ఉండకూడదంటే కనీసం సమ్మర్లో అయినా ఏదైనా పెర్ఫ్యూమ్ వినియోగించడం మంచిది.

సన్‌గ్లాసెస్
ఎండ నుంచి కళ్ళకి మంచి ప్రొటెక్షన్ సన్ గ్లాసెస్. ఒక్కోసారి ఎండ తీవ్రతకు కళ్లు బైర్లు కమ్మేస్తాయి..ఆ పరిస్థితి నుంచి మిమ్మల్ని సన్ గ్లాసెస్ రక్షిస్తాయి.

సన్‌స్క్రీన్
సన్‌స్క్రీన్ యూజ్ చేయడం వల్ల సూర్యుని తీక్షణమైన కిరణాల నుండి ప్రొటెక్షన్ లభిస్తుంది. అంతే కాక, స్కిన్ బ్లాచీగా అయిపోవడం వంటి, కలర్ మారిపోవడం వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

లిప్ బామ్
లిప్స్ చాలా డెలికేట్ గా ఉంటాయి. సన్ డ్యామేజ్ ని ఇవి తట్టుకోలేవు. అందుకే ఎప్పుడూ మీ లిప్స్ హైడ్రేటెడ్ గా ఉండాలి. కాబట్టి మాయిశ్చరైజింగ్ లిప్ బామ్ ఎప్పుడూ మీ దగ్గర ఉంచుకోండి

స్కార్ఫ్
ఒక కాటన్ స్కార్ఫ్ మీ దగ్గర ఉంటే హెయిర్ కవర్ చేసుకోండి. జుట్టు ఎండలో మలమలా మాడిపోకుండా ఉంటుంది.

చిన్న గొడుగు
ఎండవేడి నుంచి మీకు గొడుగు మంచి ఉపశమనం. పైన చెప్పినవన్నీ ఉన్నా లేకపోయినా చిన్న గొడుగు మిమ్మల్ని ఎండ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. యాక్రిలిక్ కోటింగ్ ఉన్న గొడుగు తీసుకుంటే మీ ఫేస్ తో పాటు మీ హ్యాండ్స్ కి కూడా ప్రొటెక్షన్ లభిస్తుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం