టిల్లు క్యూబ్ లో స్టార్ హీరోయిన్ – ఈ సారి మరింత ఇంట్రెస్టింగ్ గా!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్ లో తెరకెక్కిన డీజే టిల్లు ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో తెలిసిందే. రీసెంట్ గా వచ్చిన టిల్లు స్కేర్ కూడా అంతకు మించి అనిపించింది. దీంతో టిల్లు క్యూబ్ పై కాన్సన్ ట్రేట్ చేశారు మేకర్స్..ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ ఇవిగో…

డీజేటిల్లుగా కూల్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. నేహాశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో రాధికా అంటూ టిల్లు చెప్పే డైలాగ్స్ యూత్ ని ఊపేశాయి. దానికి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్కేర్ మూవీ కూడా సెన్సేషన్ హిట్ గా నిలిచింది. దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ వందకోట్లు దాటి భారీగా వసూలు చేసింది. డీజే టిల్లు తో పోలిస్తే స్కేర్ లో కాస్త మసాలా జోడించడంతో బాగానే వర్కౌట్ అయింది. చిన్న హీరో వందకోట్ల క్లబ్ లో చేరడం అంటే మాటలు కాదు కానీ ఈ ఫీట్ చేసి చూసించాడు సిద్దు జొన్నలగడ్డ. పైగా సితార ఎంటర్టైన్మెంట్స్ కి అనుబంధంగా ఉన్న హారికా అండ్ హాసిని క్రియేషన్స్ లో ఈ ఏడాది గుంటూరు కారం మూవీ రిలీజై ఫ్లాప్ అయింది. ఆ మూవీ ద్వారా వచ్చిన నష్టాలని టిల్లుగాడు పూడ్చాడని టాక్. అందుకే ఈ సిరీస్ ని కొనసాగిస్తూ టిల్లు క్యూబ్ పై కాన్సన్ ట్రేట్ చేశారు మేకర్స్.

టిల్లుగాడితో పూజా హెగ్డే
డీజే టిల్లులో నేహాశెట్టి, టిల్లు స్కేర్ లో అనుపమా పరమేశ్వరన్ నటించారు…ఇప్పుడు క్యూబ్ లో పూజా హెగ్డేని సంప్రదిస్తున్నారట. గుంటూరు కారం సినిమా కోసం ఆమెకి అడ్వాన్స్ ఇచ్చారు కానీ ఆ తర్వాత తప్పించారు..అందుకే ఇప్పుడు అదే బ్యానర్లో మరో సినిమా ఆఫర్ చేయాలని మేకక్స్ ఫిక్సయ్యారట. మరి స్టార్ హీరోయిన్ హోదాలో ఉన్న పూజా..టిల్లుగాడితో నటించేందుకు ఒప్పుకుంటుందో లేదో అని కొందరంటే…ఇప్పుడు పూజా కెరీర్ అంత ఆశాజనకంగా లేదుకాబట్టి ఓకే చెప్పొచ్చు అని మరికందరు అంటున్నారు.

మరింత కొత్తగా టిల్లు క్యూబ్
టిల్లు క్యూబ్ కోసం ఈ సారి సరికొత్త ఎలిమెంట్ ని టచ్ చేయబోతున్నారంట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. మ్యాడ్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన కళ్యాణ్ శంకర్ టిల్లు క్యూబ్ దర్శకుడు. రామ్ మిరియాల సంగీత దర్శకుడు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో ఉన్నాడు నిర్మాత నాగవంశీ. బడ్జెట్ కూడా 50 కోట్లకి పైగానే ఖర్చు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. మరి టిల్లుగా సిద్దు జొన్నలగడ్డ హంగామా ఈ పార్ట్ 3లో ఎలా ఉండబోతోందో వెయిట్ అండ్ సీ…