తెలుగు రాష్ట్రాలకు మోదీ గ్యారంటీ – వైరల్ అవుతున్న ఇంటర్యూలు

ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ పలు మీడియా సంస్థలకు ఇంటర్యూలు ఇస్తున్నారు. ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో తెలుగు మీడియాకు ఇంటర్యూలు ఇచ్చారు. అలాగే కొన్ని చానళ్లతో మాట్లాడారు. ఏపీ వికాసానికి మోదీ సంపూర్ణ గ్యారంటీ ఇచ్చారు. ఏపీ ప్రజల కోసం తీసుకుంటున్న చర్యలు.. చేసిన సాయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

పోలవరం పూర్తికి గ్యారంటీ

ఏపీకి జీవనాడి పోలవరం ప్రాజెక్టు మొదటి ఐదేళ్లు ఈ ప్రాజెక్టు పరుగులు పెట్టింది. కానీ గత ఐదేళ్లు పూర్తిగా పడకేసింది. ఈ అంశంపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీన్ని మోదీ పటా పంచలు చేసే ప్రయత్నాన్ని ఈనాడు ఇంటర్యూలో చేశారు. పోలవరం పూర్తి చేసే గ్యారంటీ తనదని స్పష్టం చేశారు. సమస్యగా మారిన ఆర్ అండ్ ఆర్ అంశంపైనా ప్రత్యేక కమిటీ వేశామన్నారు. నిజానికి పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించింది. చంద్రబాబు ప్రభుత్వం శరవేగంగా నిర్మిస్తూ డబ్బులు రీఎంబర్స్ చేసుకుంది. జగన్ ప్రభుత్వం నిర్మించకుండానే డబ్బులు కావాలని మోదీ సర్కార్ వెంట పడింది. నిర్మాణం ఆగిపోయింది. ఫలితంగా ఎన్నో సమస్యలు వెలుగు చూశాయి. ఇప్పుడు మోదీ ఈ ప్రాజెక్టు పూర్తిగా తన గ్యారంటీ అని హామీ ఇవ్వడం కూటమికి మంత బలంగా మారనుంది.

విభజన హామీల అమలుకు భరోసా

విభజన హామీల అమలుకు మోదీ భరోసా ఇచ్చారు. విభజన చట్టం సమస్యల పరిష్కారం.. రెండురాష్ట్రాల మధ్య సమన్వయం కొరవడం వల్లనే సాధ్యం కాదని.. చట్టం ప్రకారం.. తాము జోక్యం చేసుకోవాల్సి వస్తే.. పరిష్కరిస్తామని గుర్తు చేశారు. విభజన చట్టం ప్రకారం నెలకొల్పాల్సిన విద్యా సంస్థలు.. ఇతర ప్రాజెక్టులను శరవేగంగా మొదటి ఐదేళ్లలోనే అందుబాటులోకి తెచ్చినట్లుగా గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విభజన చట్టం ప్రకారం.. ఏపీకి రావాల్సిన వాటి విషయంలో స్పష్టమైన కార్యాచరణ ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు. ఎన్డీఏలో టీడీపీ ఉన్న సమయంలో విభజన చట్టంలో ఉన్న సంస్థలన్నీ శరవేగంగా మంజూరయ్యాయి. అవన్నీ ఇప్పుడు ప్రముఖ సంస్థలుగా మారాయి.

కేంద్రం సహకారం పై హామీ

ప్రధాని మోదీ ఏపీలో తమ ఎన్డీఏ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందని గ్యారంటీ ఇచ్చారు. ఇంతకు ముందు జరిగిన ఇంటర్యూల్లో ఏపీలో కూటమి ఘన విజయం సాధించబోతోందని.. వికసిత ఆంధ్రాను ప్రజలు చూస్తారని ధీమా వ్యక్తం చేశారు. మొత్తంగా ఏపీలో ప్రచారానికి వచ్చే ముందు మోదీ .. ఏపీ ప్రజలకు తన గ్యారంటీని ఇచ్చారని అనుకోవచ్చు.