ఓటు వేయడం కర్తవ్యం – పోలింగ్ శాతం పెంచేందుకు ఈసీ చర్యలు

ఎన్నికల్లో ఎంత తక్కువ ఓటింగ్ జరిగితే ప్రజాస్వామ్యానికి అంత నష్టం జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్‌ కసరత్తు చేస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో తక్కువగా ఓటింగ్‌ శాతం నమోదైన నియోజకవర్గాలపై ఇసి పోకస్‌ పెట్టింది. ఓటర్లు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగిం చుకోవాలనే ఆవశ్యకత గురించి ఓటర్‌ టర్నౌట్‌ ప్లాన్‌ను అమలు చేసే పనిలో నిమగమైంది. రాష్ట్ర, అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో నమోద వుతున్న పోలింగ్‌ వివరాలు తెలుసు కునేందుకు ఓటర్‌ టర్నౌట్‌ యాప్‌ అందు బాటులోకి తెచ్చింది.

గ్రామాల్లో పోలింగ్ అధికం – అర్బన్ లోనే తక్కువ

సాధారణంగా గ్రామాల్లో పోలింగ్ పర్సంటేజీ అధికంగా ఉంటుంది. ఉపాధి కోసం దూరాభారం వెళ్లిన వాళ్లు కూడా తిరిగి వచ్చి ఓటు వేస్తారు. కానీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్న వాళ్లతోనే పెద్ద సమస్య. వారు అసలు కదలరు. అందుకే
అర్బన్‌ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతాన్ని పెం చేందుకు యాక్షన్‌ ప్లాన్‌ను ఇప్పటికే సిద్ధం చేసింది. ఒక వైపు ఎండ తీవ్రత, మరో వైపు వడగాడ్పుల నేపథ్యంలో పోలింగ్‌ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దశలో ఎన్నికల కమిషన్‌ ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికల సమాచారాన్ని ప్రజలకు తెలియజేసే పనిలో మ్యాప్‌లను విడుదల చేయనుంది.

అవగాహన పెంచుతున్న ఈసీ

ఐపిఎల్‌-2024 క్రికెట్‌ కామెంటరీలో ఓటు ప్రాధాన్యత గురించి వివరించడం, స్టేడియంలో వివిధ రకాలుగా ప్రచారం చేయడం, ఫేస్‌బుక్‌ ద్వారా సబ్‌ స్క్రైబర్లకు ఓటింగ్‌ డే అలర్ట్‌ మెసేజ్‌లు పంపేలా ఇసి చర్యలు చేపట్టింది. దేశ వ్యాప్తంగా 1.6 లక్షల పోస్టాఫీసులు, వెయ్యి పోస్టాఫీసు ఎటిఎమ్‌లు, 1.63 లక్షల బ్యాంకు బ్రాంచ్‌లు, 2.2 లక్షల ఎటిఎమ్‌ల ద్వారా ప్రచారం చేసి ఓటర్లలో అవగాహన పెంచనున్నారు. దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో ఎస్‌విఇఇపి (స్వీప్‌) పోస్టర్ల ప్రదర్శన, రైల్వే అనౌన్స్‌మెంట్‌ ద్వారా ఓటర్లకు అవగాహన సందేశాలు వినిపించడం, 16 వేల పెట్రోల్‌ బంకుల్లో ప్రచారం నిర్వహించడం, సినిమా థియేటర్లు, ర్యాపిడో వంటి బైక్‌ యాప్‌, స్విగ్గీ, జొమోటో వంటి ఫుడ్‌ డెలివరీ యాప్‌లు, టెలికమ్‌ ఆపరేటర్ల సహాయంతో ఓటర్లకు అలెర్టు కార్యక్రమాన్ని ఈన్నికల సంఘం చేపట్టింది.

ప్రముఖులతో ఈసీ సందేశాలు

చునావ్‌ కా గర్వ్‌ దేశ్‌గా గర్వ్‌్‌ థీమ్‌తో, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ వంటి సెలబ్రిటీలతో కార్యక్రమాలు, పత్రికల్లో ప్రకటనలు, మీడియాలో ట్రెండింగ్‌ వీడియాలు, అవుట్‌డోర్‌ క్యాంపెయిన్లు నిర్వహించడం చేపట్టారు. ఇవన్నీ సత్ఫలితాలు ఇచ్చి.. దేశవ్యాప్తంగా ఓటింగ్ శాతం పెరగడానికి అవకాశం ఏర్పడుతోంది.