చైతూతో మూవీకి మూడు సార్లు నో చెప్పిన స్టార్ హీరోయిన్ – ఎందుకంటే!

నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటితో తండేవ్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది…అయితే ఇందులో హీరోయిన్ గా ఓ బ్యూటీని అనుకున్నారట కానీ ఆమె నో చెప్పింది..చైతూకి ఆ హీరోయిన్ నో చెప్పడం ఇదేం ఫస్ట్ టైమ్ కాదు… ఎందుకిలా జరుగుతోంది?

తండేల్ లో రష్మిక!
అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య..తనకంటూ ఓ ప్రత్యేకత సొంతం చేసుకున్నాడు. తన కెరీర్లో సూపర్ సక్సెస్ అందుకున్న సినిమాలు తక్కువే అయినా ఫాలోయింగ్ బాగానే సంపాదించుకున్నాడు. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో జాలరిగా చైతూ లుక్ బావుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వాస్తవానికి నాగచైతన్య తండేల్ మూవీలో హీరోయిన్ గా ఇద్దరు స్టార్ హీరోయిన్లను తీసుకోవాలి అనుకున్నారట మేకర్స్. ఒకరు సాయిపల్లవి కాగా..మరొకరు రష్మిక. ఈ మేరకు ఆమెను సంప్రదిస్తే డేట్స్ ఖాళీ లేవని చెప్పిందట.

చైతూకి నో చెప్పడం మూడోసారి
రష్మిక.. చైతూని మూవీకి నో చెప్పడం ఇదేం ఫస్ట్ టైమ్ కాదు. చైతూ కెరీర్లో మంచి హిట్ గా నిలిచిన మజిలీలో ముందుగా రష్మిక హీరోయిన్ అనుకున్నారట. కానీ ఆ సమయంలో ఆఫర్ రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత చైతన్య కస్టడీ సినిమా సమయంలోనూ రష్మికను సంప్రదిస్తే ఆ టైమ్ లోనూ కాల్ షీట్లు అడ్జెస్ట్ చేయలేకపోయిందట. చందుమొండేటి తండేల్ కోసం కూడా రష్మికను సంప్రదిస్తే ఇప్పుడు కూడా బిజీగా ఉన్నానని చెప్పిందట.

రష్మిక బిజీ బిజీ
యానిమల్ సక్సెస్ తర్వాత రష్మిక కెరీర్లో మరింత జోరు పెంచింది. ప్రస్తుతం రెయిన్ బో, చావా, గర్ల్ ఫ్రెండ్ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. రెమ్యునరేషన్ కూడా భారీగానే తీసుకుంటోందని టాక్. విజయ్ దేరవకొండతో డేటింగ్ లో ఉందని..త్వరలోనే పెళ్లిచేసుకుంటారనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ప్రస్తుతానికి కెరీర్లో చాలా చాలా బిజీగా ఉన్న నేషనల్ క్రష్..ఇప్పట్లో పెళ్లి కబురుచెప్పడం అనేది డౌటే అంటున్నారు ఫ్యాన్స్. ఇంత బిజీగా ఉండడం వల్లనే నాగ చైతన్యతో నటించే ఆఫర్ రిజెక్ట్ చేసిందంటున్నారు. మరి ఈ కాంబినేషన్ ఫ్యూచర్లో అయినా సెట్టవుతుందో లేదో వెయిట్ అండ్ సీ…