పరగడపునే స్పూన్ నెయ్యి తింటే!

నెయ్యి తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నెయ్యి భోజనం రుచి పెంచడమే కాదు..ఎన్నో ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. అయితే నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందంటారు… కానీ పరగడపునే నెయ్యి తింటే ఎంత ఆరోగ్యమో తెలుసా…

కడపులో మంట తగ్గిస్తుంది
చాలా మందికి కడుపులో మంట, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలుంటాయి. అలాంటి వారికి అద్భుతమైన ఉపశమనం నెయ్యి. ఉదయాన్నే ఖాళీ కడపుతో చెంచా నెయ్యి తింటే చాలా ప్రయోజనాలుంటాయంటారు ఆయుర్వేద నిపుణులు. ఆయుర్వేదం ప్రకారం ఇది చిన్న ప్రేగుకు చెందిన శోషణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. నెయ్యి ప్రేగులలోని పీహెచ్ స్థాయిని తగ్గిస్తుంది.

జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది
ఉదయాన్నే నెయ్యి తినడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. జీర్ణక్రియకు మంచిది అని మరీ ఎక్కువ నెయ్యి తినకూడదు…కేవలం స్పూన్ చాలు. శరీరంలో మలినాలను తొలగించి నూతన శక్తి ఇస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, డి, ఇ, కె కలయిక రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మలబద్ధకం ఉన్నవారు తప్పనిసరిగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తినాలి.

చర్మం మెరుస్తుంది
నెయ్యి తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖం అందంగా వికసిస్తుంది. జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది. నెయ్యి తినడం ద్వారా చాలా సమయం పాటు కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. అతిగా తినకుండా ఉంటారు. తద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది.

పిల్లలకు దివ్యమైన ఔషధం
నెయ్యి ఎముకల దృఢత్వాన్ని, బలాన్ని, శక్తిని పెంచుతుంది. ఎక్కువగా ఆకలి లేదనే పిల్లలకు ఉదయాన్నే వేడి చేసిన నెయ్యి స్పూన్ తాగిస్తే ఆకలి పుడుతుంది. నెయ్యిలో ఉండే ఫ్యాట్స్.. మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. నెయ్యి అందించే న్యూట్రియంట్స్ కారణంగా.. బ్రెయిన్ సెల్స్ చాలా యాక్టివ్ గా పని చేస్తాయి. మెంటల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకునేవారు పరగడుపున నెయ్యి తినడం అలవాటు చేసుకోవాలి.

బరువు పెరగరు
చాలా మంది నెయ్యి తింటే బరువు పెరుగుతారు అనుకుంటారు. అది కూడా పరగడుపున నెయ్యి తింటే ఇంకేమైనా ఉందా అని భయపడతారు. కానీ.. పరగడుపున ఒక స్పూన్ నెయ్యి తింటే.. మీ బరువు పెరిగే సమస్యకు చెక్ పెట్టొచ్చు. అధిక బరువు పెరగకుండా కంట్రోల్ చేస్తూ ఉంటుంది.
హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో బాధపడుతూ ఉంటారు. అలాంటివాళ్లు నెయ్యి తింటే ఆ సమస్యలు తగ్గుతాయి

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.