చపాతీ, పూరీ పిండి మిగిలిందని ఫ్రిజ్ లో పెడుతున్నారా!

ఇంట్లో చపాతీ, పూరీ చేసేటప్పుడు పిండి మిగిలిపోతే ఫ్రిజ్ లో పెట్టేస్తారు. అనవసంగా చేసేసి వేస్ట్ చేసే కన్నా మిగిలిన పిండి ఫ్రిజ్ లో పెడితే మరో రోజు వేడివేడిగా చేసుకుని తినొచ్చు కదా అనుకుంటారు. మరి ఇలా కలిపేసిన పిండి ఫ్రిజ్ లో పెట్టొచ్చా లేదా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు?

ఆరోగ్యంతో చెలగాటం
చపాతీ పిండి ముందుగా కలిపి పెట్టుకుంటే మెత్తగా వస్తాయని కొందరు…ఫ్రిజ్ లో పెట్టిన పిండితో చపాతీ చేస్తే మరింత స్మూత్ గా ఉంటాయని మరికొందరు ఆలోచిస్తారు. ముందుగా కలిపి పెట్టుకుంటే పర్వాలేదు కానీ ఫ్రిజ్ లో పెట్టిన పిండి విషయంలో మాత్రం ఆలోచించాల్సిందే అంటారు ఆరోగ్యనిపుణులు. పిండి పాడవకుండా , వేస్ట్ అవకుండా ఉండొచ్చు కానీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటున్నారు.

హానికరమైన వాయువులను ఆహ్వానించడమే
కలిపేసిన చపాతీ పిండి ఫ్రిజ్ లో పెడితే చాలా సులువుగా బ్యాక్టీరియా చేరుతుంది..దాంతో తయారు చేసిన చపాతీ, పూరీ తింటే కడుపులో నొప్పి వస్తుంది. సాధారణంగా చపాతీలో శరీరానికి మేలు చేసే పోషకాలు ఉంటాయి.. పిండిని ఎప్పుడైతే ఫ్రిజ్ లో పెడతామో దానిలో ఉండే మినరల్స్, విటమిన్స్ అన్నీ కరిగిపోతాయి. పైగా ఫ్రిజ్ నుంచి హానికరమైన వాయువులన్నీ పిండిలోకి ప్రవేశిస్తాయి. ఇది మీరు ఫుడ్ పాయిజనింగ్ బారిన పడే అవకాశం ఉంది. ఇలా పిండి పాడయ్యే.. విషయం బయటకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ లోలోపల చర్య జరుగుతూనే ఉంటుంది. లిస్టెరియా మోనోసైటోజెన్స్ అనే బ్యాక్టీరియా ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది మీకు చాలా తీవ్రమైన వ్యాధులను కలిగిస్తుంది. ఇన్ఫెక్షన్‍కు కారణమవుతుంది. వాస్తవానికి, తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఎక్కువ బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఫ్రిజ్ లో పెట్టిన పిండితో చేసిన చపాతీ, పూరీ తింటే కడుపు నొప్పి, మలబద్ధకం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.

స్మూత్ గా రావు
ఫ్రిజ్ లో చపాతీ పిండిని కాసేపు పెడితే అవి స్మూత్ గా వస్తాయని చాలా మంది అనుకుంటుంటారు. కానీ ఫ్రిజ్ లో ఉంచిన పిండితో చపాతీలు తయారుచేస్తే చపాతీలు గట్టిగా ఉంటాయి. వాటి టేస్ట్ కూడా మారుతుంది. పిండిని గాలి చొరబడని కంటైనర్ లో అస్సలు ఉంచకూడదు. అలాగే ఫ్రిజ్ లో కూడా పెట్టకూడదు. ఎప్పటికప్పుడు తాజాగా తినడమే మంచిది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.