హనుమాన్ హీరో సినిమాలో దుల్కర్ సల్మాన్!

రీసెంట్ గా వచ్చిన టాలీవుడ్ మూవీస్ లో హనుమాన్ సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో హీరోగా నటించిన తేజ సజ్జా కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. హనుమాన్ సక్సెస్ తర్వాత తేజకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి కానీ కథలు ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రస్తుతం తేజ సజ్జా నటిస్తోన్న మూవీ మిరాయ్. హనుమాన్ లో సూపర్ హీరోగా కనిపించిన తేజ మిరాయ్ లో సూపర్ యోధలా కనిపించనున్నాడు…దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఏంటంటే…

తేజ సజ్జాతో దుల్కర్ సల్మాన్
మిరాయ్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ లో మళయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించనున్నాడని టాక్. తనకి కార్తీక్ ఒక కీలక పాత్రకి గా ను ఇంట్రెస్టింగ్ క్యామియో రోల్ ని డిజైన్ చేసాడట. అందుకు తాను ఓకే కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ గా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మూవీకి కూడా హనుమాన్ సంగీత దర్శకుడు గౌర హరీష్ స్వరాలందిస్తున్నాడు. రితిక హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న మిరాయ్…వచ్చే ఏడాది ఏప్రిల్ 18న మొత్తం 7 భాషల్లో రిలీజ్ కానుంది.

మిరాయ్ స్టోరీ ఇదే!
సామ్రాట్‌ అశోక్‌ చరిత్రలో కళింగ యుద్ధం ఓ మరకగా మిగిలింది. లక్షల మంది ప్రాణనష్టం, రాజ్యమంతా విషాదం… ఎందుకు గెలిచానో అర్థం కాని అయోమయంలో అశోకుడు శాంతి మంత్రం పఠిస్తాడు, బౌద్ధాన్ని స్వీకరిస్తాడు, పాలనపై దృష్టి పెడతాడు. ఆ సమయంలోనే అపారమైన భారతీయ జ్ఞానం గురించి తెలుస్తుంది. మనిషిని దైవాన్ని చేసే శాస్త్రాల గురించి తెలుస్తుంది. వాటిని కాపాడాల్సిన అవసరమూ, కర్తవ్యమూ గుర్తొస్తుంది. ఆ ఆలోచనల్లో నుంచి పుట్టుకొచ్చినవారే తొమ్మిది మంది అజ్ఞాత యోధులు. తన రాజ్యమంతా గాలించి, ఆ పనులకు అర్హులను పట్టుకుంటాడు అశోకుడు… విడివిడిగా కర్తవ్యం బోధిస్తాడు… ఒక్కొక్కరికీ ఒక తరహా జ్ఞానాన్ని అప్పగించి, తరతరాలు దాన్ని కాపాడే బాధ్యత అప్పగిస్తాడు. ఇదే అసలు కథ. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ తొమ్మది మందికీ ఎవరి వివరాలు ఎవరికీ తెలియకుండా గోప్యత పాటించాలి…ఎవరైనా మరణిస్తే ఆ స్థానంలో అర్హుడిని నియమించాలి. అలా నడుస్తోన్న అజ్ఞాత వ్యవస్థను విచ్ఛిన్నం చేసే ఓ రాక్షసుడిని సంహరిస్తాడు సుప్రీం హీరో… ఇదే మిరాయ్ స్టోరీ…