థియేటర్లోనే కాదు OTT లోనూ దూసుకెళ్తున్న విశ్వక్ సేన్ మూవీ!

విభిన్నమైన కథలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న హీరో విశ్వక్ సేన్.అందుకే విశ్వక్ మూవీ అంటే ప్రేక్షకులలో ఓ మోస్తరు అంచనాలుంటాయి. సూపర్ సక్సెస్ కాకపోయినా స్టోరీ బాగానే ఉంటుందనే నమ్మకం ఉంది. రీసెంట్ గా వచ్చిన ప్రయోగాత్మక మూవీ గామి కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది. అఘోరా పాత్రలో కనిపించిన విశ్వక్ సేన్ తనలో ఉండే నటుడుని మరో మెట్టు ఎక్కించాడు. పైగా హీరో ఎవరైనా కానీ స్టోరీలో దమ్ముంటే విజయం వరిస్తుందని ప్రూవ్ చేశాడు.

OTT లో స్ట్రీమింగ్
విద్యాధర్ దర్శకత్వంలో వచ్చిన గామి సినిమాను UV గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు అందించిన ఈ సినిమా ఈ ఏడాది టాలీవుడ్ కి మరింత బూస్ట్ ఇచ్చింది. మార్చి 8న థియేటర్లో రిలీజైన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది. డేట్ మారుతుందనే టాక్ వినిపించినా అందులో నిజం లేదంటూ ఏప్రిల్ 11 అర్థరాత్రి విడుదల చేసేశారు. ఓటీటీ లో కూడా దూసుకెళుతోంది గామి. బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ఇప్పుడు డిజిటల్ లో కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలో రెస్పాన్స్ అందుకునేట్టే ఉంది.

స్టోరీ ఇదే
గామి సినిమాలో చాందిని చౌదరి ఒక స్పెషల్ పాత్రలో ఆకట్టుకుంది. మనుషుల స్పర్శను తట్టుకోలేని ఒక అఘోరా తన సమస్యను తీర్చుకోవడానికి ఒక సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెడతాడు. మరోచోట ఓ యువకుడు నిర్బంధంలో ఉంటాడు. చిత్రవధ అనుభవిస్తుంటాడు. బయటపడే ప్రయత్నాలు చేస్తుంటాడు కానీ విఫలమవుతుంటాడు. ఇంకోచోట పల్లెటూరిలో ఉమ అనే 12-13ఏళ్ల అమ్మాయి. ఆమెని తన తల్లిలాగ దేవదాసిగా మార్చే ప్రయత్నం చేస్తుంటారు. ఆమె అక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంటుంది. అసలీ మూడు కథలకి లింకేంటి? చివరికి ఈ మూడు కథలు ఒక చోట కలుస్తాయా? శంకర్ కి తన సమస్య నయమవుతుందా? ఈ ప్రశ్నలకి సమాధానమే క్లైమాక్స్. రొటీన్ సినిమా కాకుండా ఏదైనా వెరైటీగా చూద్దామనుకునే వారికి, ల్యాగులు అవీ పట్టించుకోకుండా ఓపిగ్గా చివరిదాకా చూడగలిగితే తప్పకుండా నచ్చుతుంది. కొత్త ప్రయోగాలను ఎంజాయ్ చేసేవారికి గామి నచ్చుతుంది.