కార్తికేయ 3 మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే!

యువ హీరోల్లో నిఖిల్ తనకంటూ ఓ ప్రత్యేకత సొంతం చేసుకున్నాడు. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి హిట్స్ అందుకుంటున్నాడుయ స్వామిరారా నుంచి రీసెంట్ కార్తికేయ వరకూ తన క్రేజ్ పెంచుకుంటూ వచ్చాడు. 2014లో వచ్చిన కార్తికేయ హిట్టవడంతో 8 ఏళ్ల తర్వాత సీక్వెల్ తో వచ్చి మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు అందరి కాన్సన్ ట్రేషన్ కార్తికేయ 3పై ఉంది… ఆ మూవీ వచ్చేది ఎప్పుడంటే…

మరింత భారీగా కార్తికేయ 3
నిఖిల్ – చందు మొండేటి కాంబోలో వచ్చిన కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది. శ్రీ కృష్ణుడి కాన్సెప్ట్ కావడంతో నార్త్ ప్రేక్షకులు కూడా పూనకంతో ఊగిపోయారు. ఈ మూవీ ఎండింగ్ లో కార్తికేయ 3 కూడా ఉంటుందని హింట్ ఇచ్చాడు దర్శకుడు.దానికి సంబందించిన కొంత రష్ కూడా చూపించారు. ఈ లెక్కన కార్తికేయ 3 మరింత భారీగా ఉండబోతుందని అర్ధమవుతోంది. బడ్జెట్ విషయంలోనూ అస్సలు కాంప్రమైజ్ కావద్దని ఫిక్సయ్యారట మూవీ టీమ్.

సెట్స్ పైకి వెళ్లేది వచ్చే ఏడాదేనా!
కార్తికేయ 3 షూటింగ్ త్వరలోనే మొదలెట్టేస్తారని అన్నారు కానీ… నిఖిల్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. సెట్స్ మీదున్న స్వయంభు, ది ఇండియా హౌస్ సినిమాలు పూర్తిచేసిన తర్వాత కార్తికేయ 3 సెట్స్ పైకి వెళ్లనుంది. అటు చందు మొండేటి కూడా నాగచైతన్యతో తండేల్ మూవీతో బిజీగా ఉన్నాడు. చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయ్యాక కార్తీకేయ 2 సెట్స్ పైకి వెళ్లనుంది. అంటే.. షూటింగ్ మొదలయ్యేది వచ్చే ఏడాదే కావొచ్చు. ఈ లెక్కన షూటింగ్ కి ఏడాది టైమ్ తీసుకున్నా కానీ 2026లోనే సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. పాన్ ఇండియా మూవీ అనే హడావుడి నడుస్తోంది కాబట్టి ఇంకా ఆలస్యమైతే రిలీజ్ 2027 స్టార్టింగ్ లో కూడా కావొచ్చు.

ప్రపంచంపై ఫోకస్
కార్తికేయ 3 సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి కార్తికేయ 3లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన చరిత్ర ఆనవాళ్ల గురించి.. ఆధ్యాత్మికత గురించి చెప్పబోతున్నారని టాక్. సినిమా పై ఉన్న బజ్ తో హడావిడిగా కానివ్వకుండా సినిమాను అనుకున్న రేంజ్ లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి ఈ మూవీ నిఖిల్ కు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి..