బన్నీని లైన్లో పెట్టేసిన హనుమాన్ డైరెక్టర్!

ఒక్క సినిమా ఆ డైరెక్టర్ కెరీర్ని ఊహించనంతగా మలుపుతిప్పేసింది. విజయానికి కేరాఫ్ గా చెప్పే ఆంజనేయుడు..ప్రశాంత్ వర్మకి అఖండ విజయం అందించడంతో పాటూ కెరీర్ ని పూర్తిగా గాడిన పెట్టేశాడనే అనుకోవాలేమో. ఎందుకంటే ప్రశాంత్ వర్మ త్వరలోనే అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు….

ప్రశాంత్ వర్మ లక్ మారిపోయింది
హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా సూపర్ స్టార్ అయిపోయాడు ప్రశాంత్ వర్మ. విజువల్ వండర్ గా వచ్చిన హనుమాన్ చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందర్నీ అలరించింది. అన్ని భాషల్లోనూ సక్సెస్ ట్రాక్ ఎక్కేసింది…భారీ వసూళ్లు సాధించింది. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ ఎలాంటి ప్రాజెక్ట్ తో వస్తాడా అని అంతా ఆసక్తిగా ఉన్నారు. మొదటి సినిమానుంచే విభిన్నంగా ఆలోచిస్తూ ప్రయోగాత్మక ప్రాజెక్ట్స్ తో తన మార్క్ చూపిస్తున్నాడు ప్రశాంత్. తనకి రొటీన్ సినిమాలు చేయటం నచ్చదని, డిఫరెంట్ కథలు, కొత్త జోనర్ లో కథలు చేయటమే ఇష్టమని ఇప్పటికే పలుసందర్భాల్లో వెల్లడించాడు.
ప్రజంట్ హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ తెరకెక్కిస్తున్నాడు. దీంతో పాటూ లేడి ఓరియెంటెడ్ సినిమా కూడా స్టార్ట్ చేశాడు..అది పూర్తి చేసే పనిలో ఉన్నాడు. పలువురు బాలీవుడ్ హీరోలు కూడా ప్రశాంత్ తో సినిమాలు చేయాలని చర్చలు జరుపుతున్నట్టు టాక్. రణవీర్ సింగ్ ఒక మంచి డివోషనల్ జోనర్ కోసం ఇప్పటికే ప్రశాంత్ తో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ప్రశాంత్ వర్మ ఆలోచన వేరేలా ఉంది…

అల్లు అర్జున్ తో ప్రశాంత్ వర్మ
జై హనుమాన్ తరవాత అల్లు అర్జున్ తో ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ తెరకెక్కించనున్నాడని టాక్. ఇప్పటికే బన్నీకి స్టోరీ వినిపించాడట. బన్నీకి కూడా ఆ కాన్సెప్టు బాగా నచ్చడంతో సరే అన్నాడట. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ జై హనుమాన్, లేడీ ఓరియెంటెడ్ మూవీతో బిజీగా ఉన్నాడు… మరోవైపు బన్నీ కూడా పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు…ఇద్దరూ ఆ హడావుడి నుంచి ఫ్రీ అయిన తర్వాత ఈ మూవీ పట్టాలెక్కనుందని టాక్.

ఓవరాల్ గా చూస్తే ప్రశాంత్ వర్మ కెరియర్ హనుమాన్ కి ముందు, తరవాత అన్నట్టు ఉంది. ఇప్పుడు ప్రశాంత్ అడిగితే తనతో కలిసి వర్క్ చేయటానికి, ఎంత పెద్ద స్టార్ అయినా నో చెప్పే ప్రసక్తే లేదు. తక్కువ బడ్జెట్ లోనే సినిమాని బాగా తీర్చి దిద్దుతాడనే ఇంప్రెషన్ ఉంది. ఈ లెక్కన బన్నీతో ప్రాజెక్ట్ తో కూడా సక్సెస్ అందుకుంటే..కొన్నేళ్ల పాటూ ప్రశాంత్ వర్మ కెరీర్ కి తిరుగులేదంతే…