యంగ్ టైగర్ బర్త్ డే రోజు ఫ్యాన్స్ కి పండుగే పండుగ!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మొత్తం వీటన్నింటికీ సంబంధించిన అప్ డేట్స్ అన్నీ ఎన్టీఆర్ బర్త్ డే మే 21న రానున్నట్టు తెలుస్తోంది..ఈ లెక్కన ఆ రోజు తారక్ ఫ్యాన్స్ కి పండుగే పండుగ…

మే 20న దేవర ఫస్ట్ సింగిల్
యంగ్ రెబల్ స్టార్ ఎన్టీఆర్ -కొరటాల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూవీ దేవర. RRR తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. మరోవైపు ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల కూడా చాలా ఛాలెంజింగ్ గా తెరకెక్కిస్తోన్న మూవీ ఇది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ మూవీపై హైప్ క్రియేట్ చేశాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తోన్న ఈ సినిమా అక్టోబరు 10న రిలీజ్ కానుంది. ఈ నెల 21న తారక్ పుట్టినరోజు సందర్భంగా దేవర టీం సర్ ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమవుతోందట. దేవర ఫస్ట్ సింగిల్ ని మే 20న విడుదల చేయనున్నారని టాక్..

వార్ 2 పై అదిరిపోయే అప్ డేట్
ఓవైపు దేవర షూటింగ్ లో బిజీగా ఉంటూనే మరోవైపు బాలీవుడ్ లో వార్ 2 సినిమా షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ కూడా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్ వస్తుందని తెలుస్తోంది…

ప్రశాంత్ నీల్ మూవీ ఆరంభం
ఈ రెండు సినిమాలతో పాటూ ఎన్టీఆర్ కొత్త సినిమాకు సంబంధించి అప్ డేట్ ఆ రోజు రానుంది. పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీకి కమిటయ్యాడు తారక్. ఈ మూవీని అఫీషియల్ గా ప్రకటించారు కానీ దీనికి సంబంధించి ఆ తర్వాత ఎలాంటి సమాచారం రాలేదు. అయితే తారక్ బర్త్ డే సందర్భంగా ఆరోజు పూజా కార్యక్రమాలు జరుగుతాయని టాక్. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి అయ్యాయంటున్నారు..

ఈ మూడు అప్ డేట్స్ వస్తే ఫ్యాన్స్ కి ఇంతకు మించిన జన్మదిన కానుక ఏముంటుంది…