మీ లివర్ ని డ్యామేజ్ చేసే ఆహారాలివే…

లివర్ (కాలేయం)..శరీరంలో ముఖ్యమైన అవయవం. నేటి జీవన శైలి కారణంగా లివర్ కి సంబంధించిన వ్యాధులు పెరుగుతున్నాయని అధ్యయనాల్లో వెల్లడైంది. పైగా కాలేయ సమస్యలు వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. మరి లివర్ జాగ్రత్తగా ఉంచుకోవాలంటే కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలి…అవేంటో ఇక్కడ తెలుసుకోండి..

ఆల్కాహాల్ పెద్ద విలన్

మీ లివర్ కి ఆల్కహాల్ అతిపెద్ద విలన్. అతిగా మద్యం సేవించడం వల్ల కాలేయ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అందుకే మద్యానికి దూరంగా ఉంటే మీ లివర్ కొంత వరకూ సేఫ్ గా ఉన్నట్టే..

ఊబకాయం
ఊబకాయం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు ఆహ్వానం పలుకుతుంది. ముఖ్యంగా లివర్ డ్యామేజ్ కి అతిపెద్ద శత్రువు. ప్రాసెస్ చేసిన ఆహారాలు, కొవ్వులు, చక్కెరలు అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల ఊబకాయం వస్తుంది. అందుకే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు సరా సమతుల్య ఆహారం తీసుకోవాలి. అధిక కొవ్వు కాలేయ వ్యాధికి దారి తీస్తుంది.

కాలుష్యం
కాలుష్యం రకరకాల అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తుంది. పర్యావరణ కాలుష్యాలు, రసాయన విషాలు కాలేయ కణాలను దెబ్బతీస్తాయి. కాలక్రమేణా కాలేయ పనితీరును మరింత దిగజార్చుతాయి. అందుకే పర్యావరణ పరిశుభ్రత పాటించాలి.

పెయిన్ కిల్లర్స్ వద్దు
చిన్న అనారోగ్యానికి కూడా మందులేసుకోవడం చాలా మందికి అలవాటు. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ తాత్కాలికంగా మీ పెయిన్ ని తగ్గించవచ్చు కానీ శాశ్వతంగా మీ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది…కాలేయం ఈ ప్రభావం మరింత ఎక్కువ.

పొగ
సిగరెట్ తాగితే పోతారని ఆ ప్యాకెట్ పైనే ఉంటుంది కానీ వ్యసనపరులకు అవేమీ పట్టవు. అందుకే స్మోకింగ్ ఓ ఫ్యాషన్ అనుకుని ఫాలో అయిపోతారు. కానీ స్మోకింగ్ కాలేయ వాపు, ఒత్తిడి, కాలేయ క్యాన్సర్‌కు కారణమవుతుంది.

అసురక్షిత లైంగిక సంబంధాలు, డ్రగ్స్ వినియోగం కూడా కాలేయ వ్యాధికి దారితీయొచ్చు…

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం