క్లియర్ గా కూటమి వేవ్ – బీజేపీ అగ్రనేతల ప్రచారానికి భారీ ఆదరణ !

ఏపీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వేవ్ చాలా స్పష్టంగా ఉందని తేలిపోతోంది. నిన్నటిదాకా ఓ లెక్క.. ఇక నుంచి మరో లెక్క అన్నట్లుగా బీజేపీ అగ్రనేతలు ప్రచారంలోకి దిగడంతో .. సీన్ మారిపోయింది. రాజ్ నాథ్ సింగ్, అమిషా వరుసగా ప్రచారసభల్లో పాల్గొన్నారు. అమిత్ షా ప్రచార సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ధర్మవరంలో జరిగిన సభకు జనం పోటెత్తారు.

ధర్మవరం సభకు వచ్చి న స్పందన చూసి అమిత్ షా ఆనందం

ధర్మవరం సభ విజయవంతం కోసం కూటమి నేతలు కొద్ది రోజులుగా విస్తృతంగా శ్రమించారు. ఆ ఫలితం సభ సక్సెస్ లో కనిపించిది. యాభై వేల మందికిపైగా జనం ఎర్రటి ఎండల్లోనూ అమిత్ షా ప్రసంగం వినేందుకు వచ్చారు. జై భారత్ మాతాకీ అనే నినాదంలో దొంగు కలిపారు. ఇంత మంది వస్తారని అమిత్ షా ఊహించలేకపోయారు. ఏపీలో కూటమి వేవ్ క్లియర్ గా ఉందని జాతీయ మీడియాతో కూడా చెప్పారు.

వైసీపీ ప్రభుత్వంపై సూటి విమర్శలు

వైసీపీ ప్రభుత్వం, జగన్ పై అమిత్ షా సూటి విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గూండాగిరి, అవినీతి, భూదోపిడీ అరికట్టటానికి ఈ పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ఏపీలో ఎన్డీఏ కూటమి స్వీప్ చేయబోతోందని స్పష్టం చేశారు.
తెలుగు భాషను అంతం చేయడానికి కుట్ర పన్నారని .. తాము ఉన్నంత వరకూ తెలుగుభాషను కాపాడతామని.. జగన్ రెడ్డీ గుర్తు పెట్టుకో అని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి కారణంగా పోలవరం ప్రాజెక్టు పడకేసిందని తాము రాగానే రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని హ ామీ ఇచ్చారు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే ఏపీలో అభివృద్ధి జరిగింది.. జగన్‌ అధికారంలోకి వచ్చాక.. ఏపీ అభివృద్ధి ఆగిపోయింది.. 13 లక్షల 50 వేల కోట్ల అప్పును ఏపీపై జగన్‌ రుద్దారు.. మద్యనిషేధం హామీ ఇచ్చి.. మద్యం సిండికేట్‌ను జగన్‌ ప్రోత్సహించారని మండిపడ్డారు. చంద్రబాబు, మోదీ గెలిస్తే రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీపూర్తి చేస్తామన్నారు. ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీలో మూడింట రెండు వందల మెజార్టీ చంద్రబాబుకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

మోదీ సభలతో వేవ్ ఖాయం చేసుకోనున్న కూటమి

మోదీ సోమ, బుధవారాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలతో కూటమి ఎంత బాగా ప్రజల్లోకి వెళ్లిందో స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఎటు చూసినా కూటమి ప్రచారసభలో కనిపిస్తున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన అగ్రనేతలంతా పర్యటిస్తున్నారు. ఇది క్లియర్ గా కూటమి వేవ్ ను స్పష్టం చేస్తోందన్న అప్రాయం కల్పిస్తోంది.