పాలకొండలో పేరు జనసేన – పోటీ టీడీపీ అభ్యర్థి ! జయకృష్ణ పేరు ఖరారు !

పాలకొండ జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ పేరును జనసేన చీఫ్ ఖరారు చేశారు. ఆయన నిన్నటి వరకూ టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గా ఉన్నారు. మరో టిడిపి నియోజకవర్గ స్థాయి నాయకురాలు కూడా జనసేనలో చేరినా… జయకృష్ణకే పవన్ టిక్కెట్ ప్రకటించారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేకు వైసీపీలో టిక్కెట్

పాలకొండ నియోజకవర్గం వైసిపి అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే విశ్వసరాయ కళావతిని ప్రకటించారు. టిడిపి, జనసేన, బిజెపి కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిని పోటీలో నిలిపేందుకు నిర్ణయించుకున్నారు. నిర్ణయమైతే జరిగింది గానీ, అంతపాటి అభ్యర్థి లేరట. ఆ మాటకొస్తే అభ్యర్థి మాత్రమే కాదు. కార్యకర్తలు కూడా ఆ పార్టీకి పెద్దగా లేరు. దీంతో, జనసేనకు ఏం చేయాలో అర్థంగాని పరిస్థితి. దీంతో, టిడిపి తరపున టిక్కెట్‌ ఆశిస్తున్న నియోజకవర్గ ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ ఈనెల 1వ తేదీన పిఠాపురం వారాహి యాత్రలోవున్న పవన్‌ కల్యాణ్‌ను కలిసి జనసేన కండువా కప్పేసుకున్నారు. అయితే టిక్కెట్ వెంటనే ప్రకటించలేదు పవన్ కల్యాణ్.

టిక్కెట్ కోసం జనసేనలో చేరిన మరో టీడీపీ నేత భూదేవి

మరో టిడిపి టిక్కెట్‌ ఆశావహురాలు పడాల భూదేవి కూడా ఈనెల 7న అనకాపల్లిలో పవన్‌ కల్యాణ్‌ను కలిసి జనసేన కండువా కప్పేసుకున్నారు. ఆమె కూడా జయకృష్ణ మాదిరిగా జనసేన టిక్కెట్‌ నాకే అంటూ ప్రచారం చేసుకున్నారు. మరోవైపు వారు దశాబ్ధాలు తరబడి కొనసాగుతున్న టిడిపికి మాత్రం రాజీనామాలు చేయలేదు. దీంతో, ఇద్దరు నాయకులు రాజీనామాలు చేయకుండా మనకి మాత్రం పంగనామాలు పెడుతున్నారంటూ పాలకొండ నియోజకవర్గ వ్యాప్తంగా టిడిపి, అక్కడక్కడ ఉన్న జనసేన కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. నాయకులు లేనప్పుడు జనసేన ఈ స్థానం నుంచి టిక్కెట్‌ అడగడమెందుకు, టిడిపి అంగీకరించడం దేనికన్నది ప్రశ్నార్థకంగా మారింది.

జయకృష్ణ పేరు ఖరారు

పాలకొండలో జనసేన, టిడిపి కూటమి తమ అభ్యర్థిని మంగళవారం పవన్ ప్రకటించారు. జయకృష్ణకే ఇచ్చారు. అయితే ఇంత గందరగోళం చేసుకుంటే… పార్టీ లన్నీ కలసి పని చేస్తాయా అన్నది సమస్యగా మారింది. వైసీపీలో వర్గ పోరాటం సద్దుమణిగింి. ఒకే పార్టీలో ఉంటూనే నిన్నమొన్నటి వరకు ఉత్తర దక్షిణ ధ్రువాలుగా ఉన్న కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌బాబు కలిసి పని చేసుకుంటున్నారు.