ఉండిలోనూ రఘురామరాజుకు సీటు లేనట్లే – దూకుడుగా సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రచారం

టిడిపి కంచుకోటగా ఉన్న ఉండి నియోజకవర్గంలో ఈసారి పాగా వేయడానికి వైసిపి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. .స్వాతంత్రోద్యమ కాలం నుంచి ఉండి నియోజకవర్గానికి ఎంతో చరిత్ర ఉంది. అప్పట్లో ఉద్యమానికి ఊపిరిగా ఉండే ప్రసార సాధనాలైన పత్రికలన్నీ రహస్యంగా ముద్రించి పడవలు, దోనెల్లో ప్రజలకు చేర వేసిన ఘనత ఈ నియోజకవర్గానికి ఉంది. దండి సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడమే కాకుండా ఉద్యమానికి రహస్యంగా అక్షరాయుధాలందించిన ఘనత కూడా ఉంది. ప్రత్యేకాంధ్ర ఉద్యమం అంటే ఎన్నో ఉద్యమాలకు చేయూతనిచ్చి చరిత్రకెక్కింది. అల్లూరి సీతారామరాజు జన్మించిన మోగల్లు ఈ నియోజకవర్గంలోనే ఉంది.

ఉండిలో బీసీలు ఎకకువ

ఉండి నియోజకవర్గంలో వెనుకబడిన తరగతుల వారు అత్యధికంగా ఉన్నారు. తరువాత కాపు సామాజిక వర్గం, క్షత్రియులు ఉన్నారు. ఎస్‌సి, మైనార్టీలు, ఎస్‌టిలు తరువాత స్థానాల్లో ఉన్నారు. ఎన్నికల్లో క్షత్రియ సామాజికవర్గం తీవ్రంగా ప్రభావితం చేస్తారు. కాపు సామాజికవర్గం ఓటింగ్‌తో అభ్యర్థి విజయావకాశాలు కనిపిస్తాయి. హిందూ ఓటర్లు అధికంగా ఉన్నారు.ఉండి ఉన్నత పదవులకు కేంద్రం..ఉండి నియోజకవర్గంలోని నాయకులు ఉన్నత పదవులు అలంకరించిన వారే ఉన్నారు. కలిదిండి రామచంద్రరాజు ఎన్‌టి రామారావు మంత్రివర్గంలో చిన్న తరహా మంత్రిగా, చంద్రబాబు మంత్రివర్గంలో విద్యుత్‌ శాఖా మంత్రిగా పనిచేశారు.

ఎక్కువ సార్లు గెలిచిన టీడీపీ

1951లో ఉండి నియోజకవర్గం ఏర్పడింది. 16 సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఒకసారి మధ్యంతర ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ ఐదుసార్లు, ఇండిపెండెంట్లు రెండు సార్లు, టిడిపి ఎనిమిది సార్లు ఈ స్థానాన్ని కైవశం చేసుకున్నాయి. 1970లో ఉపఎన్నిక జరిగింది. 16 పర్యాయాల్లో ఐదు సార్లు మాజీ మంత్రి కలిదిండి రామచంద్రరాజు , రెండు సార్లు ఎంఎల్‌ఎగా వేటుకూరి వెంకట శివరామరాజు ఎన్నికయ్యారు. 2004 వరకూ కాంగ్రెస్‌ అభ్యర్థులను మారుస్తూ వచ్చి విఫలమైంది. . కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పాతపాటి సర్రాజు 2004లో కలిదిండి రామచంద్రరాజుపై గెలుపొందారు. 2009 ఎన్నికల్లో శివ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా వెలుగులోకి వచ్చిన వేటుకూరి వెంకట శివరామరాజు టిడిపి తరపున పోటీ చేసి మాజీ ఎంఎల్‌ఎ పాతపాటి సర్రాజుపై గెలుపొందారు. 2014 ఎన్నికల్లో శివరామరాజు రెండోసారి పోటీ చేసి పాతపాటి సర్రాజుపై 36 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేసి మంతెన రామరాజు పివిఎల్‌ నరసింహరాజుపై పదివేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

రఘురామ పేరు పరిశీలన

కూటమికి మంచి అవకాశఆలు ఉంటాయన్న ప్రచారం నేపధ్యంలో ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకే సీటు కేటాయించారు. అయితే గత ఎన్నికల్లో ఎంపీ సీటు కోసం సీటు త్యాగం చేసిన శివరామరాజు తనకే సీటు ఇవ్వాలంటున్నారు. ఇండిపెండెంట్ గా పోటీకి రెడీ అయ్యారు. కానీ మధ్యలో ట్విస్ట్ వచ్చింది. రఘురామకృష్ణరాజు కు ఉండి సీటు కేటాయిస్తారని అంటున్నారు. ఆయనకు ఇస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే రెబల్ అయ్యే అవకాశం ఉంది. ఇద్దరు రెబల్స్ తో స్థానికేతరుడు అయిన రఘురామ పోటీ పడాల్సి వస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే దూకుడుగా ప్రచారం చేస్తున్నారు.