23న తెలంగాణకు అమిత్ షా – షాకిచ్చే చేరికలు ఉండబోతున్నాయా ?

తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవడమే టాస్క్ గా పెట్టుకున్న ్ణిత్ షా .. కర్ణాటకతో పాటు తెలంగాణపైనా దృష్టి పెట్టారు. ఇక తరచుగా పర్యటనలు చేయనున్నారు. 23వ తేదీన తెలంగాణలో అమిత్ షా పర్యటించబోతున్నారు. చేవెళ్ల కేంద్రంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా హాజరయ్యే ఈ సభకు లక్షకు తగ్గకుండా జనాలను తరలించేలా ప్లాన్‌ చేస్తున్నారు.

చేవెళ్ల సభలో బీజేపీలో చేరనున్న కీలక నేతలు

అమిత్‌ షా సమక్షంలో మాజీ మంత్రులు పార్టీలో చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ మాజీ మంత్రులు ఎవరా అనేది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత సమస్యలు ఎక్కువ కావడం ఆ పార్టీపై ప్రజా వ్యతిరేకత పెరిగిందనే అంచనాలు రావడంతో బీజేపీలో చేరికలకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా చేవెళ్ల సభలో .. అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బలంగా బీజేపీ.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై బీజేపీ ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది. ఇక్కడ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. గ్రేటర్‌ ఎన్నికల్లో శివారు ప్రాంతాల్లో కార్పొరేటర్లు విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే తరహాలో అసెంబ్లిd సీట్లను కైసవం చేసుకునేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే జాతీయ నేతల పర్యటనలు ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. అందులో భాగంగానే అమిత్‌ షా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. చేవెళ్ల పార్లమెంట్‌ పరిధితోపాటు చుట్టూరా నియోజకవర్గాల నుండి జనాలను తరలించనున్నారు.. ఈనెల 23న సాయంత్రం కర్ణాటక ప్రచారాన్ని ముగించుకుని అమిత్‌షా చేవెళ్ల సభకు హాజరుకానున్నారు.

సభ బాధ్యత తీసుకున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్లే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బహిరంగసభ బాద్యత తీసుకున్నారు. పార్లమెంట్‌ పరిధి నుండే ఎక్కువ మందిని తరలించనున్నారు. ముఖ్యంగా మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, చేవెళ్ల, పరిగి, వికారాబాద్‌, తాండూరు నియోజకవర్గాల నుండి అత్యధికంగా జనాలను తరలించాలని భావిస్తున్నారు. దాంతోపాటు యువత అధిక సంఖ్యలో హాజరయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు.. తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభ కంటే ఎక్కువ మంది తరలివచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.