దిల్ రాజుకి బలగంతో వచ్చిందంతా శాకుంతలంతో పోయిందా.?

బలగం సినిమాతో బీభత్సమైన హిట్ ఇచ్చాడు దిల్ రాజు. హిట్ ఇవ్వడమే కాదు పెట్టిన దాటికి పదింతలు కలెక్షన్లు సంపాదించాడు. అసలు బలగం సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని దిల్ రాజు ఊహించలేదు. సో.. అంతా హ్యాపీ అనుకున్న టైమ్ లో శాకుంతలం సినిమాలో పెట్టుబడి పెట్టాడు. దీంతో… బలగం సినిమాతో వచ్చిందంతా శాకుంతలం సినిమాతో దిల్ రాజు పోగొట్టుకున్నాడని అందరూ అనుకుంటున్నారు. శాకుంతలం సినిమా డిజాస్టర్. విడుదలైన 3 రోజులకే కౌంటర్ క్లోజ్ అయ్యింది. దిల్ రాజుకు నష్టాలు కూడా వచ్చాయి. అయితే అవన్నీ పెద్ద నష్టాలు కూడా కాదనే చెప్పాలి.
కాపాడిన నాన్ థియేట్రికల్ హక్కులు
శాకుంతలం సినిమా బడ్జెట్ మొత్తం రూ.70 కోట్ల వరకు తేలింది. మొదట్లో శాకుంతలం సినిమాకు గుణశేఖర్ ఒక్కడే నిర్మాత. ఆ తర్వాత దిల్ రాజు భాగస్వామ్యం చేశాడు. సినిమా మొత్తం పూర్తైన తర్వాత నైజాం హక్కులు ప్లస్ నాన్ థియేట్రికల్ హక్కులు తన దగ్గరే ఉంచుకుని మిగతా మొత్తం అమ్మేశాడు. నైజాంలో బాగానే నష్టం వచ్చింది. అయితే మిగతా ఏరియాలు ముందుగానే అమ్మేయడం వల్ల కొంత కవర్ అయ్యాడు. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో శాటిలైట్, డిజిటల్, ఆడియో, డబ్బింగ్ హక్కులు ఉండనే ఉన్నాయి. వీటితో దాదాపు తన నష్టాన్ని కవర్ అయ్యే అవకాశం ఉంది.
నష్టాలు చాలా కామన్
దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాతలు కొన్ని కొన్ని సినిమాల్లో నష్టాలు రావడం చాలా కామన్. ఎందుకంటే ప్రతీ నిర్మాత.. తన సినిమా సూపర్ హిట్ అవ్వాలనే తీస్తాడు. కానీ ఒక్కోసారి అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు. ఇలాంటి సమయంలో బయటనుంచి అప్పులు తెచ్చిన నిర్మాత, ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక ఇండస్ట్రీ నుంచే ఫేడౌట్ అయి వెళ్లిపోతుంటారు. కానీ దిల్ రాజు అలా కాదు. అప్పులకు తెచ్చి సినిమాలు తీసే టైప్ కాదు. మొత్తం తన దగ్గరున్న డబ్బుతోనే సినిమాలు కొని రిలీజ్ చేస్తుంటారు. ఒకవేళ ఒక సినిమా నష్టం వచ్చినా… ఆ నష్టాన్ని ఇంకో సినిమాతో భర్తీ చేసుకుంటారు. రాబోయే రోజుల్లో దిల్ రాజు చేతిలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, ఇండియన్ -2 లాంటి పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. శాకుంతలంతో వచ్చిన నష్టాలన్నీ ఈ సినిమాల ద్వారా వచ్చేలా దిల్ రాజు ప్లాన్ చేసుకోగలరు. అదీగాక తన సినిమాలకు వచ్చిన నష్టాన్ని దిల్ రాజు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఎంత పెట్టుబడి పెట్టాం, ఎంత వచ్చింది అనే బ్యాలన్స్ షీట్ మాత్రమే చూస్తారు తప్ప ఒక సినిమాకు ఎంత వచ్చింది, ఎంత పోయింది అని చూడరు. అందుకే శాకుంతలం డిజాస్టర్ అయినా కూడా భారీగా నష్టపోయింది గుణశేఖర్ తప్ప దిల్ రాజు ఎంత మాత్రం కాదు.