ఈ ఒక్క ఆకు చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది!

జామాకులలో ఎన్నో ప్రత్యేక గుణాలున్నాయి. వీటిని తీసుకోవడం వల్ల చాలా అనారోగ్యాలకు చెక్ పెట్టొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా జామాకుల టీ తాగడం వల్ల ఇన్సులిన్ లెవల్స్ సరి అవుతాయి. జామాకుల్లోని ఫ్లేవనాయిడ్స్, టానిన్స్, పాలీఫెనాల్స్ సమ్మేళనాలు అన్నీ కూడా రక్తంలో చక్కెర స్థాయిలని కంట్రోల్ చేస్తాయి.

@ అధ్యయనాల ప్రకారం జామాకులు ఇన్సులిన్ సెన్సెటివిటీని పెంచుతాయి. దీని వల్ల శరీరం ఇన్సులిన్ సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చేస్తుంది. ఈ జామాకుల టీ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ నుండి చక్కెర శోషణని సమర్థవంతంగా తగ్గిస్తుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి.

@ జామాకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ప్యాంక్రియాటిక్ కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో సాయపడతాయి. ప్యాంక్రియాస్ కణాలను రక్షించడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గేందుకు హెల్ప్ అవుతాయి.

@ జామాకులు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శస్త్రచికిత్స గాయాలు, చర్మం కాలిన గాయాలు, మృదు కణజాల ఇన్ఫెక్షన్ల నుంచి కోలుకోవడంలో సహాయపడతాయి

@ ప్రేగు సమస్యలకు చికిత్స చేయడంలో, కాలేయ ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చడంలో జామాకులు మంచి మెడిసిన్.

@ ప్రోస్టేట్ క్యాన్సర్‌లో కణితి పరిమాణాన్ని తగ్గించడంలో జామాకు సహాయపడుతుంది. మరొక అధ్యయనం మానవ ప్రోస్టేట్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా ఈ మొక్క యాంటీకాన్సర్ లక్షణాలను నిర్ధారించింది.

@ అధిక రక్తపోటు ఉన్న రోగులకు సంబంధించిన ఒక అధ్యయనంలో జామ ఆకులను ఉపయోగించడం వల్ల కొలెస్ట్రాల్ (9.9%), ట్రైగ్లిజరైడ్స్ (7.7%) రక్తపోటు తగ్గినట్లు తేలింది.

@ సాంప్రదాయ చికిత్సతో పోలిస్తే పీరియడ్స్ వల్ల వచ్చే నొప్పి గణనీయంగా తగ్గించడంలో జామాకు రసం ఉపయోగపడుతుంది. దీనితో గర్భాశయ తిమ్మిరి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.

@ జామ ఆకుల సారం మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడానికి పనిచేస్తుందని తేలింది.

@ జామ ఆకులలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫినాలిక్ సమ్మేళనాలు మరియు జీవసంబంధ కార్యకలాపాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

@ జామ ఆకులను ఒక లీటరు నీటిలో 20 నిమిషాలు ఉడకబెట్టాలి. ఆ నీటిని ఫిల్టర్ చేసి చల్లబర్చాలి. ఆ తర్వాత జుట్టుకి అప్లై చేసి రెండు గంటల పాటు ఉంచి శుభ్రంచేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య దూరమవుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.