ఆ రీమేక్ మూవీలో చిరు-చరణ్, విశ్వంభర తర్వాత చిరు చేయబోయే మూవీ ఇదే!

మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరి కాంబోలో మూవీ అంటే ఫ్యాన్స్ కి పండుగే. ఇప్పటికే వీళ్లద్దరూ కలసి ఆచార్యలో నటించినా ఫ్యాన్స్ కి పెద్ద కిక్కివ్వలేదు. అయితే ఈ సారి ఆ లెక్క తప్పేదేలే అంటున్నారు. ఇంతకీ ఏ మూవీలో ఇద్దరూ కలసినటిస్తున్నారో తెలుసా…

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ తర్వాత మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ ‘బ్రో డాడీ’ ని రీమేక్ చేయాలి అనుకున్నారు. మోహన్ లాల్‌ పోషించిన పాత్రను చిరంజీవి చేసేందుకు సిద్ధమయ్యారు. కొడుకు క్యారెక్టర్ కోసం మరో యంగ్ హీరోని అనుకున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా, మెగాస్టార్‌ ఇమేజ్ కి తగ్గట్లుగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ స్క్రిప్ట్‌ ను కూడా రెడీ చేశాడన్నారు. భోళా శంకర్ సినిమా ఫ్లాప్ అవడంతో బ్యాక్ టు బ్యాక్ రీమేక్ లు అవసరమా అనే ఆలోచనతో చిరంజీవి బ్రో డాడీ సినిమా రీమేక్ ను పక్కన పెట్టి విశ్వంభరపై కాన్సన్ ట్రేట్ చేశారు. అప్పటి నుంచీ బ్రో డాడీ రీమేక్ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది… మళ్లీ ఇన్నాళ్లకు ఆ చర్చ తెరపైకి వచ్చింది…

చిరు-చరణ్ నటించాలన్న పృథ్వీరాజ్
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ బ్రో డాడీ లో మోహన్‌ లాల్‌ కొడుకు గా నటించాడు. రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన పృథ్వీరాజ్ తెలుగులో బ్రో డాడీ రీమేక్ చేస్తే బాగుంటుందని తన లేటెస్ట్ మూవీ గోట్‌ లైఫ్‌ సినిమా ప్రమోషన్ లో అన్నాడు. ఈ రీమేక్ లో చిరంజీవి- చరణ్ కలసి నటిస్తే అదిరిపోతుందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశాడు. దీంతో మరోసారి ఈ మూవీపై చర్చ జరుగుతోంది. అయితే రీమేక్ కి ఫుల్ స్టాప్ పెట్టేయలేదని…కొంత గ్యాప్ తీసుకుని తెరకెక్కిస్తారనే వార్తలూ వస్తున్నాయ్. మరి ఏం జరుగుతుందో చూడాలి..

బ్రో డాడీ స్టోరీ ఇదే
నాలుగేళ్ళుగా యేషూ, అన్నా బెంగళూరులో తమ పెద్దలకు తెలియకుండా సహజీవనం చేస్తుంటారు. ఓ మంచి రోజు చూసి ఇంట్లో వాళ్ళకు చెప్పి పెళ్ళి చేసుకుందామని అనుకునేలోగా అన్నా ప్రెగ్నెంట్ అవుతుంది. ఇదే సమయంలో అర్జంట్ గా ఊరికి రమ్మని తండ్రి నుంచి ఫోన్ వస్తుంది. రాత్రికి రాత్రి బయలు దేరి ఊరెళ్ళిన యేషూ కు మరో షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. తల్లి అన్నమ్మకు లేట్ ప్రెగ్నెన్సీ వస్తుంది. కాస్తంత సిగ్గుపడుతూ జాన్, అన్నమ్మ ఈ విషయాన్ని కొడుక్కి చెబుతారు. మరి యేషూ తన విషయాన్ని తల్లిదండ్రులకు ఎలా చెప్పాడు? వాళ్ల రియాక్షన్ ఏంటి అనేదే స్టోరీ.

మరి ప్రస్తుతానికి ఈ మూవీ రీమేక్ వాయిదా పడినా..విశ్వంభర హిట్టైతే మళ్లీ తెరపైకి వస్తుందేమో..చిరు-చరణ్ కలసి నటిస్తారేమో చూడాలి…