మెగా-నందమూరి-అక్కినేని హీరోల మధ్య పెద్ద ఫైటే ఇది!

గతంలో మెగా-నందమూరి మూవీస్ ఒకేసారి రిలీజ్ అవుతున్నాయంటే ఫ్యాన్స్ మధ్య పెద్ద వారే జరిగేది. కానీ ఈ మధ్య కాలంలో ఇలాంటి హడావుడి లేదు కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం గట్టిపోటీనే ఉంది. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత మెగా-నందమూరి-అక్కినేని వార్ జరగబోతోంది. దీనికి దసరాకి టైమ్ ఫిక్సైంది…

సెప్టెంబరు 28న OG
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ “they Call him OG”. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ను RRR నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ డేట్ ఈ ఏడాది సెప్టెబర్ 28న ఫిక్స్ చేశారు. ‘అత్తారింటికి దారేది’ రిలీజ్ డేట్ కు కచ్ఛితంగా రావాలని నిర్ణయించుకున్నారు మేకర్స్. ఏపీలో ఎన్నికల హడావుడి పూర్తైన తర్వాత పవన్ సెట్స్ లో అడుగుపెడితే.. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.

అక్టోబరు 10న దేవర
యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ దేవర. మొదటి భాగాన్ని దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. RRR తర్వాత తారక్ నుంచి రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అక్టోబరు 11న తండేల్
తండేల్
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, డైరెక్టర్ చందూ మొండేటి కాంబోలో తెరకెక్కుతున్న సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ ”తండేల్”. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీని కోసం అక్టోబరు 11వ తేదీని లాక్ చేస్తున్నట్లుగా టాక్.

అక్టోబరు మొదటివారంలో NBK 109
అయితే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ లోకి నందమూరి బాలకృష్ణ కూడా దిగుతున్నట్టు తెలుస్తోంది. బాబీ దర్శకత్వంలో నటసింహం నటిస్తోన్న ‘NBK 109’ చిత్రాన్ని విజయ దశమికే విడుదల చేయాలని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు భావిస్తున్నారట. OG వచ్చిన వారం తర్వాత, ‘దేవర’ పార్ట్ 1 కంటే వారం ముందు బాలయ్య సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్. అంటే ఇంచుమించు అక్టోబరు మొదటివారంలో రిలీజ్ పక్కా అన్నమాట.

ఓవరాల్ గా చూస్తే దసరాకి మెగా – అక్కినేని – నందమూరి హీరోల మధ్య వార్ పక్కా అన్నది క్లారిటీ వచ్చేసింది. మరి ఈ పోరులో ఎవరు ముందు ఎవరు వెనుకో వెయిట్ అండ్ సీ…