ఏప్రిల్ ఆఖరి వారం ఈ వారం థియేటర్లు ఓటీటీల్లో రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే!

ప్రతి శుక్రవారం థియేటర్స్ లో సినిమాలు సందడి చేస్తుంటాయి. శుక్రవారం వస్తే అదో పండుగ, ఇండస్ట్రీకి సెంటిమెంట్. థియేటర్లతో పాటూ ఓటీటీల్లోనూ కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు సందడి చేస్తుంటాయి. ఈ వారం కూడా రెండు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అలాగే కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ తో పాటూ వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నాయి.

ఏప్రిల్ 28 ఆఖరి శుక్రవారం థియేటర్లలో వచ్చే సినిమాలివే

అఖిల్ ఏజెంట్‌ – ఏప్రిల్‌ 28
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని నటించిన సినిమా ‘ఏజెంట్’. యాక్షన్ ఎలిమెంట్స్ తో వస్తోన్న ‘ఏజెంట్’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో మమ్ముట్టి, డినో మోరియా ప్రధాన పాత్రలో నటించారు. అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు సంబంధించి రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏకే ఎంటర్ టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్ లపై నిర్మించిన ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి..

పొన్నియన్‌ సెల్వన్‌ 2 – ఏప్రిల్‌ 28
మణిరత్నం దర్శకత్వం వహించిన హిస్టారికల్ యాక్షన్ సినిమా ‘పొన్నియిన్ సెల్వన్’ కి సీక్వెల్ ‘పొన్నియిన్ సెల్వన్ 2’ కూడా ఏప్రిల్ 28 న విడుదల కానుంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్, నందిని, చియాన్ విక్రమ్, జయం రవి, త్రిష, కార్తీ, జయరామన్, నాజర్, ప్రభు, ఐశ్వర్య లక్ష్మి, శోభిత కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏ ఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ కలిసి సినిమాను నిర్మించారు. మొదటి భాగం తమిళంలో హిట్టైంది కానీ ఇతర భాషల్లో అంత మంచి రెస్పాన్స్ లేదు..మరి సీక్వెల్ కి ఎలాంటి టాక్ వస్తుందో వెయిట్ అండ్ సీ…

రారా పెనిమిటి – ఏప్రిల్‌ 28
భ‌ర్త రాక కోసం భార్య ప‌డే విర‌హ వేదన కథాంశంతో తెరకెక్కిన సినిమా ‘రారా పెనిమిటి‘. సింగిల్ క్యార‌క్ట‌ర్ తో రూపొందిన ఈ మూవీలో నందిత శ్వేత నటించింది. శ్రీ విజ‌యానంద్ పిక్చ‌ర్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాకు స‌త్య వెంక‌ట గెద్దాడ ద‌ర్శకుడు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందించిన ఈ సినిమా కూడా ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదలకానుంది.

ఓటీటీలో విడుదలకానున్న సినిమాలు/ వెబ్‌ సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్‌
1.దసరా – ఏప్రిల్‌ 27
2.కోర్ట్‌ లేడీ (వెబ్‌ సిరీస్‌) – ఏప్రిల్‌ 26
3.నోవోల్యాండ్‌ (వెబ్‌ సిరీస్‌) – ఏప్రిల్‌ 27
4.ది గుడ్‌ బ్యాడ్‌ మదర్‌ (వెబ్‌ సిరీస్‌)- ఏప్రిల్‌ 27
5.ఎకా – ఏప్రిల్‌ 28
6.బిఫోర్‌ లైఫ్‌ ఆఫ్టర్‌ డెత్‌ – ఏప్రిల్‌ 28

అమెజాన్‌ ప్రైమ్‌
1.పత్తు తల (తమిళ చిత్రం) – ఏప్రిల్‌ 27
2.సిటాడెల్‌ (ఇంగ్లీష్ వెబ్‌ సిరీస్‌) – ఏప్రిల్‌ 28

హాట్‌స్టార్‌
1.సేవ్‌ ది టైగర్స్‌ (వెబ్‌ సిరీస్‌) – ఏప్రిల్‌ 27

  1. పీటర్‌ పాన్‌ అండ్‌ వెండీ – ఏప్రిల్‌ 28

జీ5
1.వ్యవస్థ ( తెలగు వెబ్ సిరీస్)- ఏప్రిల్‌ 28
2.యూటర్న్‌ ( హిందీ సినిమా)- ఏప్రిల్‌ 28

సోనీలివ్‌
1.తురముఖమ్‌ (మలయాళ చిత్రం)- ఏప్రిల్‌ 28

ఆహా
జల్లికట్టు (తమిళ వెబ్ సిరీస్ పెట్టైకాళి తెలుగు వెర్షన్) – ఏప్రిల్ 26నుంచి స్ట్రీమింగ్ అవుతోంది