తెలంగాణలో సంచలనం రేపిన నవీన్ హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి చేశారు.
“నవీన్ హత్య కేసులో యువతికి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటివరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో ఆమె ఇన్వాల్వ్ అయినట్లు ఆధారాలు ఏం లభించలేదు” అని రాచకొండ సీపీ డిఎస్ చౌహన్ వెల్లడించారు. హరిహరకృష్ణకు సహకరించిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. స్నేహితుడ్ని పాశవికంగా హత్య చేసిన తీరుపై హరిహర కృష్ణ వద్ద వివరాలు రాబడుతున్నట్లు తెలిపారు. ఈనెల 9 వరకు నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే సీన్ రీకన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారు పోలీసులు.
నవీన్ని అంత దారుణంగా చంపడానికి కేవలం లవ్ ఇష్యూనే కారణమా లేకపోతే ఇంకేమైనా గొడవలు ఉన్నాయా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. హత్య చేసిన అనంతరం హరిహరకృష్ణ లొంగిపోయినా.. ఎలాంటి ఆధారాలు దొరక్కుండా పక్కాగా ప్లాన్ చేయడం వెనుక నిందితుడికి ఎవరైనా సహాయం చేశారా.. సలహాలిచ్చారా.. అనే వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. నిందితుడు స్నేహితురాలికి.. మూడుసార్లు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చి విచారించినా.. క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు.
పోలీసుల విచారణలో మున్ముందు కీలక విషయాలు బయటకువచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో రానున్న రోజుల్లో ఈ కేసులో మరిన్ని ట్విస్ట్లు చోటుచేసుకుంటాయని చెబుతున్నారు.