శాస్త్రవేత్తలకు ప్రశ్నలా మిగిలిన అద్భుతమైన శివాలయాలివే!

ప్రతి ఆలయానికీ ఓ చరిత్ర, ప్రాముఖ్యత ఉంటాయి. అయితే కొన్ని ఆలయాలు ప్రత్యేక రహస్యాన్ని కలిగి ఉంటాయి. వాటిలో ఈ 5 శివాలయాలు ఉన్నాయి. శాస్త్రవేత్తలకు సవాల్ గా మారిన ఆ శివాలయాలపై ప్రత్యేక కథనం..

రోజుకి 3 రంగుల్లో కనిపించే శివలింగం
రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఈ అద్భుతమైన శివాలయం ఉంది. అచలేశ్వర మహాదేవ్‌ని ఆలయంలో శివలింగం రంగు రోజుకు మూడు సార్లు మారుతుంది. ఉదయం శివలింగంపై ఎరుపు రంగు, మధ్యాహ్నం కుంకుమ వర్ణంలో సాయంత్రం హారతి సమయంలో నలుపు రంగు కనిపిస్తుంది.

అసంపూర్తిగా ఉండిపోయిన శివాలయం
భోజేశ్వర్ మహాదేవ్ ఆలయం ప్రపంచంలోనే అతి పురాతనమైన శివాలయంగా చెబుతారు. దీనిని భోజ రాజు నిర్మించినట్లు చెబుతారు. సాధువుల బృందం కూడా ఈ ఆలయంలో కఠోర తపస్సు చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోజ్‌పూర్ లో ఈ ఆలయ నిర్మాణం పూర్తి కాలేదు. సగం నిర్మించిన శివాలయంగానే భక్తులకు దర్శనమిస్తోంది.

శివాలయం నిండా రంధ్రాలే
ఛత్తీస్‌గఢ్‌లోని లక్ష్మణేశ్వర్ మహాదేవ్ ఆలయం రహస్యమైన శివాలయాల్లో ఒకటి. ఈ ఆలయంలో లక్ష రంధ్రాలు ఉన్నాయి. వాటిలో ఒక ప్రత్యేక రంధ్రం ఉంది, ఇది శివలింగానికి సమర్పించిన మొత్తం నీటిని ఒకేసారి పీల్చుకుంటుంది. ఈ రంధ్రాన్ని పాతాళం అంటారు. ఎప్పుడూ నీటితో నిండి ఉండే ఈ గుడిలో రంధ్రాలు ఎలా వచ్చాయని ఆశ్చర్యకరమైన విషయం.

రోజూ మాయమై తిరిగి ప్రత్యక్షమయ్యే శివలింగం
గుజరాత్‌లోని స్తంభేశ్వర్ మహాదేవ ఆలయం అత్యంత అద్భుతమైన శివాలయాల్లో ఒకటి. ఈ ఆలయంలో శివలింగం రోజుకు రెండుసార్లు అదృశ్యమవుతుంది. కొంత సమయం తర్వాత తిరిగి కనిపిస్తుంది. శివునికి జలాభిషేకం చేయడానికి సగరుడు స్వయంగా వచ్చినప్పుడు శివుడు అదృశ్యమవుతాడని నమ్ముతారు. ఈ ఆలయం పేరు జంబూసర్ తహసీల్ స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం. ఈ శివాలయం గుజరాత్‌లోని వడోదరకు 40 కి.మీ దూరంలో ఉంది.

పిడుగుపాటుకి విరిగిపోయి అతుక్కునే శివలింగం
కులు లోయలోని బిజిలీ మహాదేవ్ ఆలయం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పిడుగుపాటుకు గురవుతుంది. ఈ పిడుగు చాలా భయంకరంగా నేలను తాకుతుంది, పిడుగుపాటుకు శివలింగమే పగిలిపోతుంది. కానీ ఆలయ పూజారులు మరుసటి రోజు ఈ శివలింగాన్ని వెన్నతో తిరిగి అతికించేస్తారు. మునుపటిలా మారిపోతుంది.

గమనిక: పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..