కాంగ్రెస్ పార్టీ నేతలు భారతదేశం కంటే పాకిస్థాన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కరాచీలో వర్షం పడితే ముంబైలో గొడుగులు వేసుకుని తిరుగుతారు. అక్కడ జరిగే పరిణామాలను సునిశితంగా పరిశీలిస్తుంటారు. పాక్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదులు ఇండియాలో మారణహోమం సృష్టిస్తున్నా కాంగ్రెస్ పార్టీకి చీమకుట్టినట్లుగా కూడా అనిపించలేదు. అందుకే పాకిస్థాన్లోని చాలా మందికి కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం. దేశ భక్తులైన బీజేపీ నేతలు ఓడిపోయి, కాంగ్రెస్ పార్టీ గెలవాలని పాకిస్థాన్లో కొందరు నేతలు ఎదురుచూస్తున్నారు….
రాహుల్ గాంధీకి ఫవద్ చౌదరి ప్రశంసలు…
భారతదేశంలో లోక్ సభ ఎన్నికల వేళ పాకిస్థాన్ మాజీ మంత్రి చౌదరి ఫవద్ హుసేన్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రశంసలతో ముంచెత్తారు. బీజేపీని విమర్శిస్తూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలన్నింటినీ చౌదరి ఫవర్ హుసేన్ సామాజిక మాధ్యమాల్లో ట్యాగ్ చేసి మరీ ప్రచారం కల్పించారు. ఇమ్రాన్ ఖాన్ కేబినెట్లో మంత్రిగా చేసిన చౌదరి ఫవద్ హుసేన్ ట్యాగ్ చేసిన అన్ని వీడియోలు రాహుల్ గాంధీకి సంబంధించినవే ఉన్నాయి. రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ చేసిన ప్రసంగానికి ఫదవ్ విస్తృత ప్రచారం కల్పించారు.. రామాలయ ప్రారంభోత్సవానికి, పేదరిక నిర్మూలనకు లింకు పెట్టి రాహుల్ గాంధీ అప్పట్లో మాట్లాడారు..
కాంగ్రెస్ క్షీణిస్తుంటే..పాకిస్థాన్ ఏడుస్తోంది -మోదీ..
ఫవద్ హుసేన్ వ్యాఖ్యలను ప్రధాని మోదీ ఇవాళ ఒక సభలో ప్రస్తావించారు. భారత్లో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంటే.. పాకిస్థాన్లో కొందరు కన్నీరు కారుస్తున్నారని మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి పాకిస్థాన్ కు ఉన్న భాగస్వామ్యం ఇప్పుడిప్పుడే బయటపడుతోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలవాలని పాక్ నేతలు రోజూ ప్రార్థనలు చేస్తున్నారన్నారు. ఎలాగోలా కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని వాళ్లు కలలుగంటున్నారన్నారు. మన శత్రువులకు దేశంలో బలహీనమైన ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు…ముంబై ఉగ్రదాడుల తరహా సంఘటనలను భరించగల ప్రభుత్వాలు వాళ్లకు కావాలన్నారు…
కాంగ్రెస్ -పాక్ సంబంధాలపై విష్ణువర్ణన్ రెడ్డి విమర్శలు
బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి కూడా చౌదరి ఫవర్ హుసేన్ తీరును విమర్శిస్తూ ఎక్స్లలో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్రలున్నాయని, అది వారి మేనిఫెస్టో అని ఆయన వ్యాఖ్యానించారు. దానితో సరిహద్దు అవతలి నుంచి అనుమతి వచ్చిందని ఆయన విమర్శించారు. అదే విధంగా రాహుల్ గాంధీని పాకిస్థాన్ నేతలు మద్దతివ్వడాన్ని కూడా చూడాలన్నారు. ఫవద్ హుసేన్ నేరుగానే రాహుల్ గాంధీని ప్రమోట్ చేస్తున్నారని విష్ణవర్థన్ రెడ్డి గుర్తుచేశారు…