అక్షయ తృతీయ రోజు బంగారం వద్దు..ఇవి కొనితెచ్చుకోండి!

మే 10న అక్షయ తృతీయ. హిందూ సాంప్రదాయంలో అతి ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఏటా వైశాఖ మాసంలో శుక్లపక్ష తృతీయ తిథి నాడు అక్షయ తృతీయ జరుపుకుంటారు. ఈ రోజు బంగారం కొంటే మంచిదని భావిస్తారు…అయితే బంగారం కన్నా ఈ వస్తువులు కొనుగోలు చేయడం మరింత అదృష్టం అంటారు పండితులు..

అక్షయతృతీయ రోజు బంగారాన్ని కొనుగోలు చేయలేనివారు దక్షిణావర్తి శంఖాన్ని ఇంటికి తీసుకొచ్చి పూజగదిలో పెట్టి పూజ చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి కొలువుంటుంది అని చెబుతారు.

అక్షయ తృతీయ రోజు పాదరస శివలింగాన్ని ఇంటికి తీసుకొచ్చి నియమ నిష్టలతో అభిషేకం చేస్తే కష్టాలు తొలగిపోతాయి.

ఏకాక్షి కొబ్బరికాయను తీసుకువచ్చి, లక్ష్మీదేవి రూపంగా భావించి పూజ చేస్తే లక్ష్మీదేవి కటాక్షం మెండుగా ఉంటుంది

అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయలేని వారు కొత్త కుండను కొనుగోలు చేసి తెచ్చుకుంటే మంచిది

శ్రీ యంత్రాన్ని తీసుకొచ్చి పూజ చేసి ఆ తర్వాత ఎర్రటి గుడ్డలో చుట్టి బీరువాలో ఉంచితే సిరిసంపదలకు కొదవు ఉండదని నమ్మకం

బంగారమే కాదు అక్షయ తృతీయ రోజు మట్టి కుండ కూడా కొనుగోలు చేయడం మంచిది. అలాగే వాటిని దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

బంగారం కొనలేని వాళ్ళు గవ్వలు కూడా కొనుగోలు చేయవచ్చు. పూజ మందిరంలో లక్ష్మీదేవితో పాటు గవ్వలు ఉంచాలి. ఎర్రటి వస్త్రంలో ఈ గవ్వలు చుట్టి పెట్టుకుంటే చాలా మంచిది. లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ మీ వెంటే ఉంటాయి.

అక్షయ తృతీయ రోజున బార్లీ గింజలు కొనుగోలు చేస్తే ధన ధాన్యాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు. పూజా మందిరంలో లక్ష్మీదేవికి బార్లీ గింజలు సమర్పించాలి.

అక్షయ తృతీయ నాడు చేసే పూజలు, జపం, దానం మొదలైనవి చేస్తే ఎన్నో రెట్లు శుభ ఫలితాలను ఇస్తాయి. ఇటువంటి మంచి రోజున ఈ పనులు చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజు శ్రీ సూక్తాన్ని 11 సార్లు , ఓం శ్రీం శ్రీయే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి.
అక్షయ తృతీయ అంటే అనంతమైనది, తరగనిది, చెక్కుచెదరనిది ఫలప్రదమైనదిగా చెప్తారు. ఈరోజు ఏ పని చేసినా ఎప్పటికీ విఫలం కాదని నమ్ముతారు. ఈరోజునే విష్ణువులోని భాగమైన వేద వ్యాస మహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాయడం ప్రారంభించాడని, ఇదే రోజు గంగమ్మ స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిందంటారు. శ్రీ మహావిష్ణువు పరశురాముడు అవతారాన్ని ఈ రోజే ఎత్తాడని నమ్ముతారు. ఈరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం చాలా మంచిది. ఎలాంటి ముహూర్తాలతో సంబంధం లేదు ఈ రోజు ఏ సమయంలో ఏ కార్యం తలపెట్టినా మంచే జరుగుతుందని విశ్వాసం.

గమనిక: పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..