పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మరిన్ని అవకాశాలు – గడవు పెంచిన ఈసీ

రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ల ద్వారా జరుగుతున్న పోలింగ్ ప్రక్రియలో పలువురు ఉద్యోగుల ఓట్లు గల్లంతు కావడంతో పలు జిల్లాల్లో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దీంతో ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల ఓటు హక్కును తిరస్కరించరాదని స్పష్టం చేశారు. ప్రతి నియోజక వర్గం ఆర్వో పరిధిలో స్పాట్ లోనే ఫార్మ్ 12 ను స్వీకరించి ఓటు హక్కును కల్పించాలని ఈసీ ప్రకటించింది. మేలోగా ఫారం 12 దరఖాస్తు చేయని వారికి కూడా తక్షణం జారీ చేయాలని, ఎక్కడికక్కడ ఓట్లు అనుమతించాలని ఈసీ కార్యాలయం ఆదేశించింది.

అందరికీ ఓటు వేసే అవకాశం

ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించు కునేందుకు జిల్లా కేంద్రాాలకు తరలి వస్తున్నారు. శని, ఆదివారాల్లో పలువురు ఉద్యోగులు తమ ఓట్లు గల్లంతయ్యాయని ఫిర్యాదు చేయడంతో ఈసీ తక్షణం స్పందించింది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి ఓటు హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించవద్దని, స్పాట్ లోనే ఫార్మ్ 12 ను స్వీకరించి అర్హులైన ఉద్యోగులందరికీ ఓటు హక్కును కల్పించాలని రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులకు, ఆర్వోలకు ఆదేశాలు జారీచేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు ఓటర్లు ఫారం-12ను సకాలంలో సమర్పించ లేకపోవడంతో తమ ఓటును వినియోగించుకోలేకపోతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చినట్లు సీఈఓ తెలిపారు.

ఎన్నికల విధుల్లో పాల్గొనే వారి ఓటు పదిలం

పోస్టల్‌ బ్యాలెట్‌పై ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని, ఎన్నికల కమిషనర్‌ మార్గదర్శకాల ప్రకారం అందరూ ఓటు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని అధికారులు ప్రకటించారు. సిబ్బందికి 7, 8 తేదీల్లో ఉదయం 8 గంటల నుండే బ్యాలెట్‌ ఓటింగ్‌ ఉంటుందన్నారు. గుంటూరు జిల్లాలో ఓటు కలిగి, ఇక్కడే ఓటు వినియోగించుకునే వారితోపాటు, ఇక్కడ ఓటు ఉండి, వేరే జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న వారు, ఇతర జిల్లాల్లో ఓటు కలిగి, ఇక్కడ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారు కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఫారం-12 ప్రకారం వారు ఏఏ జిల్లాలకు చెందిన వారో గుర్తించి, అక్కడి అధికారులతో సమన్వయం చేసుకొని, వారి ఓటున్న నియోజకవర్గ బ్యాలెట్‌ను కూడా తెప్పించామన్నారు.

ఉద్యోగులు వారి కుటుంబసభ్యుల ఓట్లు కీలకం

మొత్తం ఓటర్లలో ఉద్యోగుల శాతం ఓక శాతం వరకూ ఉండొచ్చు. కానీ వారి కుటుంబ సభ్యులను కనీసం ఇద్దరిని కలుపుకుంటే 4శాతానికి పెరుగుతుంది. ఒక్క పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారానే 3 శాతం ఓట్లను ఉద్యోగులు ప్రభావితం చేయగలుగుతున్నారంటే నేరుగా ప్రత్యక్ష ఎన్నికల్లో వినియోగించుకునే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పదవీ విరమణ చెందిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులుంటా రు. వీరే కాకుండా కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ సీపీఎస్‌ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు వారి కుటుంబ సభ్యులు కూడా ఓట్లు వే