పాకిస్థాన్ కే చెప్పేశామంటున్న మోదీ…

ప్రధాని మోదీ అంటే దృఢనిశ్చయం. మోదీ అంటే ధైర్యం. మోదీ అంటే ముక్కుసూటి తనం. మోదీ అంటే ఎవరికీ భయపడని నైజం. ఎవరినైనా దారికి తీసుకురాగల తత్వం మోదీది. పాకిస్థాన్ అంటే మాకేమిటన్న తీరులో మోదీ ముందుకు సాగారు. నేరుగానే శత్రువుతోనే డీల్ చేయగల తత్వం ఆయనది. అందుకే మోదీ అంటే అందరికీ సింహస్వప్నం….

బాలాకోట్ వైమానిక దాడులపై వివరణ…

పాక్ ఆక్రమిత కశ్మీర్ పై సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ఏం జరుగుతుందోనని ప్రపంచం మొత్తం ఎదురు చూసింది. దొంగ దెబ్బ తప్పితే నేరుగా తలపడలేని పాకిస్థాన్ మౌనం వహించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మినహా ఆ దేశం వేరే పనేమీ చేయలేదు. దానితో మరోసారి గట్టి దెబ్బ కొడితే తప్ప పాక్ దారికి రాదని మోదీ ప్రభుత్వం గుర్తించింది. అంతే తమ సైనిక దళాలకు ఆదేశాలిచ్చింది. బాలాకోట్ లో ఉన్న జైషే మొహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు జరిగాయి.భవనాలు ధ్వంసం కావడంతో పాటు పదుల సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయారు. ఆ సంగతిని చాలా ఆలస్యంగా పాక్ ప్రభుత్వం అంగీకరించింది…

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రస్తావన…

2019 ఫిబ్రవరి 26న బాలాకోట్ వైమానిక దాడులు జరిగాయి. అంతకుముందు కొన్ని రోజుల క్రితం పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. వారి ఆత్మకు శాంతి కలిగించాలంటే ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేయడమొక్కటే మార్గమని భారత ప్రభుత్వం గుర్తించి.. బాలాకోట్ పై వైమానిక దాడులు జరిపింది. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ నాటి సంగతులన్నింటినీ ప్రస్తావిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలాకోట్ ప్రస్తావన చేస్తూ దాడుల విషయాన్ని పాకిస్థాన్ కు తొలుత తామే చెప్పామన్నారు. భారత సైన్యాధికారులు ఎవ్వరూ మీడియా ముందుకు వెళ్లొద్దని సూచించినట్లు, తాము స్వయంగా పాకిస్థాన్ పాలకులకు విషయం చెప్పిన తర్వాత పూర్తి వివరాలు మీడియా ముందు పెట్టాలని అప్పట్లో ప్రధాని ఆదేశించారు. కొద్ది సేపటికే పాక్ అధికారులను సంప్రదించడం, వారికి పూర్తి వివరాలు వెల్లడించడంతో పాటు దాడికి కారణాలు కూడా విశదీకరించడం జరిగిపోయింది.

ఖంగుతిన్న పాక్ పాలకులు, ఆర్మీ

అప్పటికే సర్జికల్ స్ట్రైక్స్ లో దిమ్మతిరిగిపోయి ఉన్న పాకిస్థాన్ ప్రభుత్వానికి బాలాకోట్ దాడులు షాకిచ్చాయి. తమ భూభాగంలోకి వచ్చి దాడి జరుపుతారని ఊహించని ఆ దేశ పాలకులు ధైర్యంగా నిద్రపోతున్న తరుణంలో మన సేనలు బాంబుల వర్షం కురిపించాయి. దానితో పాకి పాలకులు కొంతమేర దారికి వచ్చారు. భారత దేశ ప్రజలు మోదీ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరహాలో చేతులు ముడుచుకు కూర్చోకుండా మోదీ ధైర్యంగా అడుగులు వేస్తున్నారని ప్రజలు మెచ్చుకున్నారు…