రోజూ పాలు తాగినా అనారోగ్యమేనా – ఇందులో నిజమెంత ? వైద్యులేం చెబుతున్నారు?

పాలు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెబుతారు. రోజుకో గ్లాస్ పాలు తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుంది, నిద్రపోయే ముందు తాగితే ప్రశాంతమైన నిద్ర పడుతుందంటారు. అయితే నిత్యం పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? నిత్యం పాలు తాగితే నష్టమేంటి – లాభమేంటి? వైద్యులేమంటున్నారో ఇక్కడ తెలుసుకోండి…

పాలు పోషకాహారం
పాలను మంచి పోషకాహారంగా చెప్తారు. అయితే పాలు చిన్న వయసులో పని చేసినంత ఎఫెక్టివ్‌గా వయసు పెరిగే కొద్దీ పని చేయవంటున్నారు వైద్యులు. శరీరం పాలను శోషించుకునే శక్తి చిన్నప్పుడు ఎక్కువగా ఉంటుందట. పెద్దయ్యే కొద్దీ అది తగ్గుతూ వస్తుందట. అయినప్పటికీ రోజువారీ డైట్‌లో భాగంగా పాలు తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. పాలలో కాల్షియం, ‘ఎ’, ‘బీ2’, ‘బీ12’ విటమిన్లతో పాటు పలు మినరల్స్ కూడా ఉంటాయి. అలాగే ఒక కప్పు పాలలో దాదాపు 150 కేలరీలు, 8 గ్రాముల ప్రోటీన్, 8 గ్రాముల ఫ్యాట్ ఉంటాయి.

జీర్ణ సమస్యలు ఉన్నవారు తాగొద్దు
పాలలో ఉండే పోషకాల రీత్యా జనరల్ హెల్త్ కోసం పాలు తీసుకోవడం మంచిదే కానీ జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు పాలకు దూరగా ఉంటే మంచిదని నిపుణులు చెప్తున్నారు. పాలు అతిగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

చర్మవ్యాధులున్నా పాలు తాగొద్దు
కొన్ని రకాల చర్మ వ్యాధులు ఉన్నవాళ్లకు కూడా పాలకు దూరంగా ఉండాలి. పాలకు ఎలర్జీలను ప్రేరేపించే లక్షణం ఉంటుంది. అల్సర్, లాక్టోస్ ఎలర్జీలు ఉంటే పాలకు దూరంగా ఉండాలి.

వెజిటేరియన్స్ తీసుకోవాలి
మాంసాహరం తక్కువగా తినేవాళ్లు పాలు తీసుకుంటే పోషకాహార లోపాలు రాకుండా చూసుకోవచ్చు. పాలలో ‘బీ12’ విటమిన్ ఉంటుంది. కాబట్టి వెజిటేరియన్లు పాలు లేదా పెరుగుని రోజూ తీసుకోవడం మంచిది. అయితే ఆరోగ్యానికి మంచిదని అతిగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవు. అందుకే రోజుకి 400 మిల్లీ లీటర్లకు మించి పాలు తాగకూడదు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.