అవతారాలు సరే… హిట్ ఏది సామీ.?

హీరో విక్రమ్ గురించి ఏమాత్రం పరిచయం అవసరం లేదు. భారతదేశం గర్వించదగ్గ నటుడు. ఒక పాత్ర కోసం తన శరీరాన్ని ఎంత కష్టపడటానికి అయితే వెనుకాడే వ్యక్తి కాదు. గతంలో ఐ సినిమా కోసం 40 కేజీలు బరువుకు వచ్చేశాడు. ఆ తర్వాత పొన్నియన్ సెల్వన్ కోసం మళ్లీ బరువు పెరిగాడు. కథ నచ్చితే, దర్శకుడు ఓకే అనాలే కానీ సినిమా కోసం ప్రాణం పెట్టేస్తాడు విక్రమ్. ఇప్పుడు విక్రమ్ లేటెస్ట్ సినిమా తంగలాన్ సినిమా కోసం ఓ కోవలోకే వస్తుంది. ఒక గిరిజన తెగ నాయకుడిగా విక్రమ్ లుక్ చూసి ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. విక్రమ్ బర్త్ డే సందర్భంగా తంగలాన్ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో విక్రమ్ యాక్టింగ్, డెడికేషన్ చూసి ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోతున్నరు. దటీజ్ విక్రమ్ అంటున్నారు
సినిమాలు సరే.. హిట్ ఏది?
కళ్లముందు అదిరిపోయే బిర్యానీ ఉంది. కానీ టేస్ట్ లేదు. ఏం లాభం. విక్రమ్ సినిమాలు కూడా అంతే. అద్భుతంగా తీస్తే సరిపోతుందా. అవి జనాలకు నచ్చాలి కదా. జనానికి నచ్చని, మెచ్చని సినిమాలకు ఎన్ని అవార్డులు వస్తే ఏం లాభం. ప్రస్తుతం విక్రమ్ కూడా ఇదే ఫేజ్ లో ఇబ్బంది పడుతున్నాడు. సినిమాలు తీస్తున్నాడు కానీ హిట్ మాత్రం దొరకడం లేదు. ఎంత విభిన్నంగా ట్రై చేసినా… విక్రమ్ బాగా చేశాడు అంటున్నారు తప్ప.. మూవీస్ తో హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు. తమిళ మార్కెట్ ని మినహాయిస్తే… తెలుగులో అపరిచితుడు తర్వాత ఆ రేంజ్ హిట్ మళ్లీ ఇంతవరకు లేదు. తమిళ్ లో హిట్స్ ఇస్తున్నాడు కానీ అవి విక్రమ్ రేంజ్ హిట్స్ కావు.
ఆశలన్నీ తంగలాన్ పైనే..
ఇప్పుడు విక్రమ్ ఆశలన్నీ తంగలాన్ మూవీపైనే. ఈ సినిమా కోసం దాదాపు ఏడాది నుంచి కష్టపడుతున్నాడు విక్రమ్. ఇంకా చెప్పాలంటే హాలీవుడ్ మూవీ అపోకలిప్సో రేంజ్ లో ఈ సినిమా హిట్ అవుతుందని ఆశ పడుతున్నాడు. పొన్నియల్ సెల్వన్ లాంటి సినిమాలు ఎన్ని వచ్చినా కూడా తంగలానే లాంటి మూవీ హిట్ అయితేనే మజా. మేకింగ్ కూడా రిలీజ్ చేసి మూవీపై అంచనాలు పెంచేశారు మేకర్స్. మరి ఈ సినిమాతో అయినా విక్రమ్ తన రేంజ్ హిట్ ఇస్తాడో లేదో వెయిట్ అండ్ సీ.