ప్రతీ దానికి మోదీని విమర్శించి పెద్ద నాయకుడ్నని కేటీఆర్ ఫీలవుతున్నారా !?

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు అనే హోదాతో పదవులు పొంది అత్యంత నోటి దురుసు రాజకీయ నేతల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న కేటీఆర్ ప్రతీ విషయంలో ప్రధాని మోదీని విమర్శించడానికి ఉత్సాహపడుతున్నారు. ప్రతీ చిన్న విషయానికి ఆయన మోదీ పేరు ప్రస్తావిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఫాక్స్ కాన్ సంస్థ ఓ పరిశ్రమ పెట్టాలని నిర్ణయించుకుంది. దానికి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మోదీ ఇన్ని ఇబ్బందులు పెట్టినా … పెట్టుబడులు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. కేటీఆర్ మాటలు విన్న వారంతా ఆశ్చర్యపోయారు.

మోదీ అడ్డుకుంటే తెలంగాణకు ఒక్క పరిశ్రమ వస్తుందా ?

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిజంగా పెట్టుబడును అడ్డుకోవాలంటే తెలంగాణకు ఒక్క పరిశ్రమఅయినా వస్తుందా ? ఈ విషయంలో అసలు నిజమేమిటో కేటీఆర్ కు స్పష్టంగా తెలుసు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలో వద్దో ఆయన పారిశ్రామికవేత్తల్ని డిసైడ్ చేయగలరు. ఆయన వద్దనుకుంటే వెనక్కి పంపేయగలరు. ఇలా ఎంత మందిని పంపారో ఆయనకు తెలుసు. మరి దేశానికి ప్రధాని స్థాయిలో ఉన్న నేత .. తెలంగాణలో పెట్టుబడుల్ని అడ్డుకోవాలనుకుంటే ఎంత సేపు ? ఈ లాజిక్ కేటీఆర్ ఎలా మిస్సవుతారు. కావాలనే మిస్సవుతారు. మోదీపై అయిన దానికి . .. కాని దానికి నిందలేస్తే.. తానే పెద్ద నాయకుడ్నవుతానన్నట్లుగా ఆయన తీరు ఉంది

మోదీని విమర్శిస్తే పెద్ద నాయకులు కాలేరు..నవ్వుల పాలవుతారు !

కేటీఆర్ సిరిసిల్లలో మహేందర్ రెడ్డి అనే నేత రాజకీయ భవిష్యత్ ను తన సొంతం చేసుకున్నారు. వంద ఓట్ల అతి తక్కువ మెజార్టీతో తొలి సారి గెలిచారు. తర్వాత తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని గెలుస్తూ వస్తున్నారు. ఆ తెలంగాణ ఉద్యమ వేడి ఇప్పుడు ఐస్ క్రీమ్ లా కరిగిపోయింది. తెలంగాణ ఏర్పాటుతో వచ్చిన పదవులు అనుభవిస్తూ అహంకారంతో విర్రవీగిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కన్నూమిన్నూ కానరాకుండా ప్రతీ దానికి మోదీపై విమర్శలు చేయడాన్ని ప్యాషన్ గా మార్చుకున్నారు. అలా మోదీని విమర్శించి పెద్ద నాయకుడ్ని అయిపోయానని ఫీలయితే అంత కంటే అమాయకులు ఉండరు. అలా అనుకున్న వారంతా అడ్రస్ లేకుండా పోయారని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

అవినీతి, అక్రమాల దందాలు వెలికి తీయడం ఆపేస్తారనుకోవడం అపోహే !

ఏదో మోదీ మీద పోరాడుతున్నాం కాబట్టి తమపై కేసులు పెడుతున్నారన్న కలరింగ్ ఇచ్చుకోవడానికి కేటీఆర్ తో పాటు ఆయన కుటంబ సభ్యులు మోదీపై వ్యాఖ్యలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సాక్ష్యాలతో సహా ఈడీ , సీబీఐలు కవిత పాత్రను నిర్ధారించాయి. హైదరాబాద్ లోని బడా రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టిన కేటీఆర్ బినామీ పెట్టుబడుల గుట్టు అంతా ఈడీ, ఐటీల వద్ద ఉందని.. ఏ క్షణమైనా దీనిపై అసలు కథ వెలుగులోకి వస్తుందన్న ప్రచారం ఉంది. వీటి నుంచి తప్పించుకోవడానికే కేటీఆర్ రకరకాల డ్రామాలు వేస్తున్నారని అంటున్నారు.