బీజేపీ క్యాడర్ లో నిరాశ – పొత్తుల్లో న్యాయం జరగలేదని భావనలో ఉన్నారా ?

ఏపీ బీజేపీలో అంత ఉత్సాహం కనిపించడం లేదు. పోటీ చేయడానికి సీనియర్లకు అవకాశం దొరకలేదు. కొంత మంది నిఖార్సైన కార్యకర్తలకు అవకాశం దక్కితే అటూ ఇటూ రాజకీయాలు జరిగి చివరికి వారినీ తప్పిస్తున్నారు. ఆనపర్తి అభ్యర్థి మార్పు అంశం చివరికి బీజేపీలో నిర్వేదం వ్యక్తమవుదోంది.

ఆనపర్తి బీజేపీ అభ్యర్థికి సహకరించని టీడీపీ

ఆనపర్తిని బీజేపీకి కేటాయించారు. అ స్థానానికి అభ్యర్థిని ప్రకటించారు. కానీ ఆ అభ్యర్థికి టీడీపీ ఏ మాత్రం సహకరించలేదు. ఇప్పుడు టీడీపీ నేతను అభ్యర్థిగా నిర్ణయిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మాజీ సైనికుడు అయిన రామకృష్ణంరాజు నిఖార్సైన బీజేపీ కార్యకర్త. ఆ విషయం అందరికీ తెలుసు. అలాంటి నేతను తప్పించడం .. తప్పుడు సంకేతాలను పంపుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

టీడీపీ నేతల్ని అభ్యర్థులుగా నిర్ణయిస్తే బీజేపీకి కేటాయింపు ఎందుకు ?

బీజేపీకి నాయకుల కొరత లేదు. టీడీపీ నేతల్ని అభ్యర్థులుగా ఎంపిక చేసుకోవాల్సిన అవసరం లేదు. పొత్తుల్లో భాగంగా సీట్లు ఇచ్చిన చోట బలమైన అభ్యర్థులు లేరనుకుంటే.. బీజేపీకి బలమైన అభ్యర్థులు ఉన్న చోట్ల సీట్లు కేటాయిస్తే సమస్య పరిష్కారమవుతుంది. అలాంటి దిశగా పార్టీ నేతలు ఆలోచించకపోవడం కార్యకర్తలకు ఇబ్బందికరంగా మారింది.

కూటమిలో అందరూ సమానమే !

కూటమిలో అందరూ సమానవే. అన్ని పార్టీలు ఎక్కువే. ఓ సీటును కేటాయించినప్పుడు ఎవరికి ఇచ్చినా అందరూ కలిసి గెలిపించుకునే ప్రయత్నం చేయాలి. కానీ అలాంటి స్ఫూర్తి కూటమిలో కనిపించడం లేదన్న భావన వ్యక్తమవుతోంది.