మైగ్రేన్ నొప్పితో బాధపడుతున్నారా…అయితే ఇవి పాటించి చూడండి!

మైగ్రేన్ నొప్పి…ఈ మధ్య చాలామందిని వేధిస్తున్న సమస్య. ఎన్ని మందులు వాడినా కొన్నిసార్లు ఉపశమనం లభించదు. ఇలాంటి వారు ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే ఉపశమనం ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు..

మైగ్రేన్ తలనొప్పికి కారణాలు
ఒత్తిడి, నిద్ర లేకపోవడం, హార్మోన్ల మార్పులు, శారీరక కారకాలు, మందుల వినియోగం…ఇలా రకరకాల కారణాలున్నాయి. కానీ కొన్నిసార్లు మీకు ఇష్టమైన ఆహారాలు, పానీయాలు కూడా మైగ్రేన్‌లను ప్రేరేపిస్తాయి. ముఖ్యంగా సాల్టీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కొందరిలో మైగ్రేన్‌లను ప్రేరేపిస్తాయి.

ఆయుర్వేదం పరిష్కారం
మైగ్రేన్ అనేది నాడీ సంబంధిత రుగ్మత. ఇది సాధారణంగా మందులు, జీవనశైలి మార్పులతో తగ్గుతుంది. ఆయుర్వేదంలో మైగ్రేన్ చికిత్సకు మూలికా ఔషధాలను ఉపయోగిస్తారు. ముఖ్యంగా శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి విశ్రాంతి పద్ధతులు ఉపయోగిస్తారు. ఈ పద్ధతులు శరీర నొప్పి, తలనొప్పి, రక్తపోటు, డిప్రెషన్‌ను తగ్గిస్తాయి, నివారిస్తాయి. పంచకర్మ చికిత్స శరీరాన్ని శుభ్రపరుస్తుంది, శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది. దీని కారణంగా నొప్పి వంటి తీవ్రమైన సమస్యలు క్రమంగా తగ్గుతాయి.

యోగాతోనూ లాభం
యోగా అనేది చాలా పురాతనమైన అభ్యాసం. ఇది మనస్సు, శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచుతుంది. యోగా ఆసనాలు మన రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మైగ్రేన్ ప్రభావం తగ్గుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మన శరీరంలో ఎండార్ఫిన్ విడుదల అవుతుంది. ఇవి సహజ నొప్పి నివారణలు. ఇది ఆందోళన, నిరాశకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఆయుర్వేద చికిత్స ద్వారా మైగ్రేన్ కి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అయితే మీరు నేరుగా ప్రయోగాలు చేయవద్దు…ఆయుర్వేద నిపుణులను సంప్రదించిన తర్వాతే ఇవి ఫాలో అవండి…ఎందుకంటే మీ శరీరతత్వాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ మారుతుంది…

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.