నెల్లూరులో వైసీపీ నేతల మధ్యనే హోరాహోరీ – గెలుపు కోసం విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి పోటీ !

సింహపురి బరిలో వైసిపి, టిడిపి తరపున అభ్యర్థులు రంగంలో ఉన్నారు. టీడీపీ తరపున పోటీ చేస్తున్న నేత నిన్నటి వరకూ వైసీపీలో జగన్ ఆంతరంగికుడు. పార్టీ మారిపోయి టీడీపీ తరపున ఎంపీగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి బరిలో ఉన్నా ఆయన ఎవరో కూడా చాలా మందికి తెలియదు. అందుకే లెక్కలోకి తీసుకోవడం లేదు.

వైసీపీ వర్సెస్ మాజీ వైసీపీ

టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి (వీపీఆర్‌), వైసీపీ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డి (వీఎస్‌ఆర్‌)ల మధ్య ప్రతిష్టాత్మక పోటీ సాగుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు వీరిద్దరూ ఒకే పార్టీ నేతలు. ఇద్దరు కూడా రాజ్యసభ సభ్యులే. అంతేకాదు ఒకే జిల్లా వాసులు. అయితే వీరి వ్యక్తిత్వాలు మాత్రం పూర్తిగా భిన్నమైనవిగా ప్రజలు భావిస్తున్నారు.

ట్రస్ట్ తో సేవలకు భారీగా ఖర్చు పెట్టిన కూటమి అభ్యర్థి వీపీఆర్

వీపీఆర్‌ రాజకీయాల్లోకి అడుగు పెట్టకముందు నుంచే వీపీఆర్‌ ట్రస్ట్‌ స్థాపించి వ్యాపార రంగా నికి సమాంతరంగా జిల్లాలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫ్లోరైడ్‌ బాధిత గ్రామాల ప్రజల దృష్టిలో జలదాతగా గుర్తింపు పొందారు. సొంత నిధులతో వందకు పైగా మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్‌ స్థాయి విద్యను అందించాలన్న ఉద్దేశంతో ఎనిమిదేళ్ల క్రితమే పాఠశాల స్థాపించారు. అక్కడుండేవారికి పుస్తకాలు, భోజన వసతిని ఉచితంగానే అందజేస్తు న్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, ఆలయాల పునరుద్ధరణకు భారీ మొత్తాలను అందించారు.

విజయసాయిరెడ్డి దత్తత గ్రామానికి ఏమీ చేయలేదన్న విమర్శలు

సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండ లం, తాళ్లపాక ఆయన సొంతూరు. రెండున్నరేళ్ల క్రితం ఆ గ్రామా న్ని ఆయన దత్తత తీసుకున్నారు. కమ్యూనిటీ హాల్‌, కల్యాణ మండం కట్టిస్తానన్నారు. రూ.14 కోట్లతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. అవేవి చేయలేదు. ప్రభుత్వ నిధులతో నాలుగు రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు వేశారు తప్ప ఆయన సొంత నిధులు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఇకపోతే ప్రభుత్వ నిధులతోనైనాసరే ఇచ్చిన ప్రధాన హామీలు నెరవేర్చలేకపోయారన్న విమర్శలు చేస్తున్నారు.

వేమిరెడ్డికే వైసీపీ టిక్కెట్ ప్రకటించింది. కానీ ఆయన టీడీపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేయాలనుకోవడంతో విజయసాయిరెడ్డిని జగన్ రంగంలోకి దింపారు. జాతీయ. స్థాయిలో మోదీ వేవ్ పెద్ద ఎత్తున ఉండటంతో కూటమి అభ్యర్థి ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు.