ఈ మూవీలో అనుష్క పాత్రకి బాహుబలిని మించి!

పాన్ ఇండియా మార్కెట్లో తిరుగులేని క్రేజ్ అందుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి. బాహుబలి మూవీతో ప్రభాస్ తో సమానమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత చాలా ప్రాజెక్టులు పలకరించినా అనుష్క ఓకే చెప్పలేదు. కంటెంట్ ఉన్న స్టోరీస్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ అడుగులు వేస్తోంది. ఓ దశలో అనుష్క తీసుకున్న గ్యాప్ చూసి సినిమాలకు గుడ్ బై చెప్పేసిందేమో అనే ప్రచారమూ జరిగింది…ఆ తర్వాత పెళ్లి అనే హడావుడి జరిగింది..కానీ మిస్ శెట్టి మూవీతో వచ్చి సక్సెస్ అందుకుంది. రెమ్యునరేషన్ విషయంలో కూడా ఆమె పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు కానీ కంటెంట్ లేకుండా ఓకే చెప్పడం లేదు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న స్వీటీ…హిస్టారికల్ బ్యాగ్రౌండ్ మూవీ షూటింగ్ లో ఉంది.

క్రిష్ తో మరోసారి
వేదంలో సరోజగా నటనలో ఫుల్ మార్కులు కొట్టేసిన అనుష్క..మరోసారి క్రిష్ దర్శకత్వంలో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఘాటీ అనే ఆ సినిమా ఎలాంటి హడావిడి లేకుండా మొదలైపోయింది. పవన్ కళ్యాణ్ తో తెరకెక్కిస్తున్న హరిహరవీరమల్లుకి ప్రస్తుతానికి బ్రేక్ పడడంతో క్రిష్..అనుష్క మూవీపై ఫుల్ కాన్సన్ ట్రేట్ చేశాడు. దీనికి సంబంధించి రీసెంట్ గా విడుదలైన పోస్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ముసుగులో నడుచుకుంటూ వెళుతున్నట్టు అనుష్క కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో ఆమె ఫేస్ రివీల్ చేయకపోయినా…మరో దేవసేన క్యారెక్టర్ లా ఉందంటున్నారు నెటిజన్లు.

ఏజ్డ్ క్యారెక్టర్
బాహుబలి సినిమాలో అనుష్క యువరాణి దేవసేన గా కనిపించి మళ్లీ ఆ తర్వాత వయసు పైబడిన మహిళగా కూడా నటించింది. బాహుబలితో ప్రేమలో ఉన్నప్పుడు ఎంత అందంగా ఉందో..బళ్లాలదేవ రాజ్యంలో బంధీగా ఉన్నప్పుడు ఏజ్డ్ క్యారెక్టర్లో, చాలా అగ్రెసివ్ గా కనిపించి షాకిచ్చింది. ఈ మూవీలో కూడా దాదాపు 60 ఏళ్ల వససున్న పాత్రలో కనిపించబోతున్నట్టు టాక్. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఘాటీ సినిమా లో క్యారెక్టర్ ఆమె కెరీర్లో ప్రత్యేకంగా ఉండిపోతుంది అంటున్నారు.

స్టోరీ లైన్ ఇదే
అన్యాయానికి గురైన ఒక సాధారణ మహిళ న్యాయం కోసం ఎలా పోరాడింది అనే పాయింట్ తో నిజ జీవితంలోని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయింది…వీలైనంత త్వరలో షూటింగ్ కంప్లీట్ చేసేసి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. మరి అనుష్క ప్రయత్నం ఈసారి ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో చూడాలి.