క్యాన్సర్ కణాలు ఎక్కడైనా పెరగొచ్చు..చివరికి కంటిలో కూడా పెరిగే అవసరం అవకాశం ఉంది. కాబట్టి కంటి క్యాన్సర్ లక్షణాలు అస్సలు తేలిగ్గా తీసుకోవద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు…
అరుదైన క్యాన్సర్
ప్రపంచంలో ప్రతి 10 లక్షల మందిలో ఐదుగురికి కంటికి క్యాన్సర్ వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అరుదైన క్యాన్సర్లలో ఇదొకటి. ఇది ఎ్వరికైనా, ఎప్పుడైనా రావచ్చు. శరీరానికి వచ్చే అరుదైన క్యాన్సర్ రకాల్లో ఇది ఒకటి. కంటిలోని నల్ల గుడ్డు చుట్టూ లేదా నల్ల గుడ్డు చుట్టూ ఉన్న నిర్మాణాలలో కణితులు ఏర్పడే అవకాశం ఉంది.
కంటి క్యాన్సర్ లక్షణాలు
@ కొన్నిసార్లు దృష్టిని అకస్మాత్తుగా కోల్పోతారు, లేదా దృష్టి అస్పష్టంగా మారుతుంది
@ ప్రతిదీ రెండుగా కనిపిస్తుంది. ఇది కూడా కంటికి క్యాన్సర్ లక్షణమే
@ కంటిలో తెల్లటి ప్రతిబింబం కనిపిస్తుంది. చూస్తున్నప్పుడు పూర్తి దృశ్యం స్పష్టంగా కనబడకుండా, కొంతమేరకు చీకటి ప్రాంతంలో కనిపిస్తుంది. ఇది కూడా కంటి క్యాన్సర్ ప్రారంభ సంకేతంగానే భావించాలి
@ కనురెప్ప కింద చిన్న గడ్డల్లాగా తగులుతున్నా కూడా తేలిగ్గా తీసుకోకూడదు
@ కనురెప్పల మీద చిన్న ఎర్రటి పూతలు కంటి క్యాన్సర్ సంకేతమే
@ కనురెప్పలపై ఈ కంటి క్యాన్సర్ ప్రభావం పడుతుంది. హానికరమైన కణాలు పెరిగిపోవడం వల్ల కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం వంటివి జరుగుతాయి. ఇలా వెంట్రుకలు రాలిపోతుంటే వెంటనే వైద్యులను కలవాల్సిన అవసరం ఉంది
@ కనురెప్పల్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. కనురెప్పల అంచుల్లో ఎరుపు గడ్డలు ఏర్పడతాయి. ఇది బ్యాక్టీరియా వల్ల కూడా కావచ్చు. ఎక్కువ కాలం పాటు నయం కాకపోతే మాత్రం అది క్యాన్సర్ ఏమోనని అనుమానించాల్సిందే.
@ కన్ను ఉబ్బినట్టు అయినా, కంటి నొప్పి వస్తున్నా, కన్నీళ్ళల్లో రక్తపు బొట్లు పడుతున్నా, కంటిలో నల్లగుడ్డు స్థానం మారినా కూడా అది కంటి క్యాన్సర్ ప్రారంభ సంకేతాలుగా భావించాలి.
కంటి క్యాన్సర్ ఎక్కువగా యాభై ఏళ్లు పైబడిన వారిలో వస్తూ ఉంటుంది. వారసత్వంగా కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల వల్ల కూడా కంటికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు వైద్యులు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.