మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు జరిగిందన్నారు. . జగన్ ప్రభుత్వంలో ఉమ్మడి దళితులకు అన్యాయం జరిగిందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు.
ఎస్సీ వర్గీకరణ హామీ ఇచ్చిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమని అన్నారు. వైసీపీ పాలనలో విద్య, ఉద్యోగం, సంక్షేమం, రాజకీయంగా దళితులకి అన్యాయం జరిగిందని మండిపడ్డారు. అంబేద్కర్ విదేశీ విద్యకి జగన్ పేరు పెట్టడం దుర్మార్గమన్నారు. దళితుల చదువులకి జగన్ సొంత సొమ్ము చెల్లించడం లేదని… ప్రభుత్వ సొమ్మును వినియోగిస్తున్నారని చెప్పారు. విదేశీ విద్యకి జగన్ పేరు మంచిదేనని జూపూడి మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మందకృష్ణ మాదిగ విమర్శిస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్సీ వర్గాలకు కేంద్రం సపోర్ట్ చేసింది. కమిటీని నియమించింది. ప్రధాని మోదీ ఆధ్యక్షతన .. ఎమ్మార్పీఎస్ సభను కూడా.. మందకృష్ణ నిర్వహించారు. ఇప్పుడు ఏపీలో కూడా మంందకృష్ణ మద్దతు ప్రకటించారు. మాది విశ్వరూపసభలో మోదీ గతంలో ప్రసంగించరు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాదిగలను విరోధులుగా చూస్తున్నాయన్నారు. ఎంతో ప్రేమతో మందకృష్ణ (మందకృష్ణ మాదిగ) తమ్ముడు ఈ సభకు తనను ఆహ్వానించారన్నారు ప్రధాని మోడీ. బీజేపీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ గత 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారన్నారు. మాదగిల ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు, సదరు ప్రక్రియను వేగవంతం చేయాలని కేబినెట్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులకు ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రక్రియ వేగంగా సాగుతోంది.
దళితుల మద్దతుతో కూటమికి మరింత బలం
దళితుల మద్దతుతో కూటమికి మరింత బలం వచ్చింది. ఇప్పటికే అనేక సర్వేల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించబోతోందని చెబుతున్నారు. ఈ క్రమంలో అన్ని వర్గాలూ మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. కూటమి బలం అంతకంతకూ పెరుగుతోంది.