కేంద్రం ఏపీకి ప్రత్యేకంగా ఇచ్చినవి ఇవే – వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి

చిలుకలూరిపేట ప్రజాగళం సభతో వైసీపీకి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ప్రధాని మోదీ సభకు వెల్లువలా జనం రావడం.. మోదీ చేసిన విమర్శలు సూటిగా తగలడంతో ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ప్రధాని మోదీ ఏపీకి ఏం చేశారంటూ.. విచిత్రంగా ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు ఏమీ తెలియదని.. తాము ఏం చెబితే అది నమ్ముతారన్నట్లుగా మాట్లాడేస్తున్నారు. కానీ ప్రజలు వైసీపీ ఏర్పాటు చేసిన మాయా ప్రపంచం నుంచి బయటకు వచ్చారు. నిజాలు తెలుసుకుంటున్నారు. వైసీపీకి .. విష్ణువర్ధన్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు.

లక్షల కోట్లు ఇస్తున్నట్లుగా జగనే చెప్పారు తెలియదా ?

అందరికీ ఇచ్చినవే ఏపీకి ఇచ్చారు.. కొత్తగా ఇచ్చిందేమిటి అని.. కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టుల్ని తక్కువ చేసి మాట్లాడారు పేర్ని నాని. అయ్యా పేర్ని నాని… ఇటీవల మీ పార్టీ అధ్యక్షులు విశాఖ విజన్ పేరుతో ఓ పాంప్లెట్ పంచారు. రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే పదేళ్లలో పెడతామని చెప్పారు. ఒక్క సారి ఆ పాంప్లెట్ ముందు పెట్టుకుని చూడండి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పెట్టుబడులే రూ. 80వేల కోట్లు ఉంటాయి. అవి కేంద్రం ప్రత్యేకంగా ఇచ్చినవి కావా.. జగన్ మోహన్ రెడ్డి ప్రచారం చేసుకోలేదా ? అనంతుపురంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ఎన్ని రాష్ట్రాల్లో ఉందో తెలుసా మీకు ?. సివిల్ సర్వీస్ అధికారులకు శిక్షణ ఇచ్చే కేంద్రం ముస్సోరి తర్వాత అనంతపురంలోనే పెట్టారని తెలుసా ? రూ. లక్ష కోట్లతో ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది. దేశంలోనే అత్యధికంగా నిధుల కేటాయింపు ఏపీకే జరుగుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఏపీకి ప్రత్యేకంగా ఇచ్చినవి లెక్కలేనన్ని ఉన్నాయని విష్ణువర్ధన్ రెడ్డి బయట పెట్టారు.

అసలు వైసీపీ ప్రజలకు ఏం చేసింది ?

ముందు బీజేపీని అనే బదులు ఐదేళ్లలో మీ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రజలకు ఏమైనా చేసిందా ?. చేయాల్సినవి అంటే జీతాలు, పెన్షన్లు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు రాజధానిని ఇంచ్ కదిలించలేకపోయారు.. డబ్బులిచ్ిచనా పోలవరం కట్టుకోవడం చేతకాలేదన్నారు. రేషన్ బియ్యం, సంక్షేమ పథకాల పేరుతో అప్పులు తెచ్చిన అరకొర పంచిన డబ్బులను.. కులాల వారీగా లెక్కలు తీసి ఇంత ఇచ్చామని అందరికీ ఇచ్చామని చెప్పడం తప్ప.. ప్రత్యేకంగా ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల యువత ఆర్థికంగా నిలబడటానికి.. ఈ ఐదేళ్లలో ఉపాధి కోసం ఎన్ని లోన్లు ఇచ్చారు ? ఎంత సాయం చేశారో చెప్పగలరా ? ఎన్ని ఇళ్లు కట్టారో చెప్పగలరా ?. ఎన్ని ఉద్యోగాలు తెచ్చారో చెప్పగలరా ?. కాకి లెక్కలతో కాలక్షేపంచేయడం కాదు.. మీ చేతకాని తనాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలుసుకోవాలన్నారు.

కేంద్రం సహకరించకపోతే ప్రభుత్వం ఇప్పటి వరకూ నడిచేదా ?

ఏపీ ప్రభుత్వం దివాలా తీస్తే అది దేశానికి ఇబ్బందికరమన్న ఉద్దేశంతో… కేంద్రం ఏపీ పట్ల ఉదారంగా వ్యవహరించింది. చేతకాని పాలనతో ఆర్థికంగా సర్వనాశనం చేసినా ఎప్పటికప్పుడు సాయం చేసింది. అయినా .. ఆ విషయం గుర్తు పెట్టుకోకుండా ఇప్పుడు ఏపీకి ఏం చేశారంటూ.. ప్రశ్నిస్తున్నారు. ఏపీకి కేంద్రం ఏమీ చేయకపోతే.. వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఉండేదా అంటే… ఎవరైనా.. కష్టమనే అంటారు.