తెలంగాణ బీజేపీ నేతల్ని కాంగ్రెస్‌లో చేర్చాలనే తాపత్రయం మీడియాకు ఎందుకో !?

తెలంగాణలోనూ కొన్ని మీడియాలు వ్యవహరిస్తున్న తీరు తరచూ వివాదాస్పదం అవుతూనే ఉంది. తెలంగాణ ఎన్నికల తర్వాత ఇదిగో వారంతా పార్టీ మారిపోతున్నారని ప్రచారం ప్రారంభించేశారు. బీజేపీ నేతలు ఎవరు ఢిల్లీ వెళ్లినా అందు కోసమేనని ప్రచారం చేయడం ప్రారంభించారు. చివరికి అదేమీ లేదని ఆయా నేతలు చెబుతున్నా వినడం లేదు. మీడియా సాయంతో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి.. బీజేపీ నేతలను పిలుస్తున్నారు. గెలుస్తామని రావాలని గాలం వేస్తున్నారు. కానీ నేతలకు మాత్రం గెలిచే పార్టీ ఏదో క్లారిటీ ఉన్నట్లుగానే కనిపిస్తోంది.

బీజేపీ చేరిన నేతల్ని కాంగ్రెస్ లోకి పంపాలనే ఆత్రుత

బీజేపీలో ఇటీవలి కాలంలో కొంత మంది సీనియర్లు చేరారు. ఈటలా రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా మరికొంత మంది చేరారు. కేసీఆర్ ను ఓడించాలన్న సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి బీజేపీలో చేరారు. కాంగ్రెస్ వల్ల కాదని.. బీజేపీ మాత్రమే ఓడించగలుగుతుందని వారు నమ్మారు. అలాంటి ఊపు వచ్చింది. బీఆర్ఎస్ ను గట్టిగా ఎదుర్కొనే పార్టీ బీజేపీ అనే నమ్ముతున్నారు. అయితే వారిపై మీడియా విభిన్నమైన కథనాలు ప్రసారం చేస్తోంది. వారేం మాట్లాడినా అందులో అర్థాలు వెదుక్కుని పార్టీ మారడానికే ఇలా అన్నారని చెప్పడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మెంటల్ గా ఆ నేతల్ని కాంగ్రెస్ లోకి పంపడానికి మీడియా ఇలా చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్దోంది.

బండి సంజయ్‌పై మోదీ, షాలకు గట్టి నమ్మకం !

బండి సంజ్ పై ప్రధాని మోదీ, అమిత్ షాలకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆయన బీజేపీ తెలంగాణ బాద్యతలు చేపట్టిన తర్వాతే ఎక్కడా లేనంత ఊపు వచ్చిందని వారు నమ్ముతున్నారు. అందుకే కొత్తగా వచ్చిన నేతలు ఎంత ఒత్తిడి చేస్ున్నా బండి సంజయ్ ను మార్చే ప్రశ్నే లేదంటున్నారు. రాజకీయాలు డైనమిక్ గా ఉంటాయి. ఎప్పుడు ఎవరి వైపు గాలి మళ్లుతుందో చెప్పలేం. ఈ విషయంలో బీజేపీ పార్టీకి కొన్ని అడ్వాంటేజ్ లు తెలంగాణలో ఉన్నాయి. కేసీఆర్ పై స్ట్రాటజిగక్ గా దాడి చేయడంలో బండి సంజయ్ ను మించిన వారు లేరు. తెలంగాణలో కేసీఆర్ ను ఎవరైనా ఓడించగలరు అంటే అది బీజేపీనేనన్న ఓ నమ్మకం బలంగా ఉంది. దాన్ని ఇప్పుడు చాలా పకడ్బందీగా ఉపయోగించుకుంటున్నారు. పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు.

త్రిముఖ పోటీ ఉండేలా చేయడానికే కాంగ్రెస్ ఆరాటం

తెలంగాణలో ముఖాముఖి పోరు జరిగితే పదేళ్ల అదికార వ్యతిరేకత .. అధికార పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉందని పోల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీని ప్రజలు ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. అలా ఏకపక్షంగా ఓటింగ్ జరిగితే బీజేపీకి తిరుగులేని విజయం లభిస్తుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండటానికి బీజేపీలో చేరిన వారిని కాంగ్రెస్ లోకి పంపి.. త్రిముఖ పోటీ జరిగేలా చేయడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కలిసి ఆడుతున్న పొలిటికల్ గేమ్ గా భావిస్తున్నారు. ఈ విషయంలో బండి సంజయ్ సహా ఇతర బీజేపీ నేతలంతా.. వారి రాజకీయ వ్యూహాల్ని పకడ్బందీగా తిప్పికొడుతున్నారని అనుకోవచ్చు.