జర్నలిస్టులనూ వదలని కేసీఆర్ – నయవంచన చేశారంటూ ధర్నాలు !

తెలంగాణలో సీనియర్ జర్నలిస్టులంతా కేసీఆర్ ఇంత మోసం చేస్తారా అని మథనపడిపోతున్నారు. ఆయన చెప్పిన మాటలేంటి.. చేస్తున్నదేంటి అని ధర్నాలకు దిగారు. ఇందిపార్క్ వద్ద జర్నలిస్టులు ధర్నా చేస్తున్నారు. గతంలో అక్కడ ఇతరులు ధర్నాలు చేస్తూంటే.. వారు కవరేజీ చేసవాళ్లు. ఇప్పుడు వారే ధర్నాకు దిగాల్సిన పరిస్థితి. ఎందుకంటే సీఎం కేసీఆర్ వారిని కూడా వదల్లేదు. వారి స్థలాల్ని కూడా సొంత పార్టీ నేతలకు… ఆస్మదీయులకు కట్టబెట్టేందుకు వారిని రోడ్డున పడేయడానికి సిద్ధం అయిపోవడమే.

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా పట్టించుకోని కేసీఆర్

జర్నలిస్టులకు వైఎస్ హయాంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. కానీ అవి వివాదంలో ఉన్న భూములు . అప్పట్లో అవి ఊరికి దూరంగా ఉన్నయి. చివరికి వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఇటీవల సుప్రీంకోర్టులో ఉన్న వివాదాన్ని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం క్లియర్ చేసింది. కానీఇంత కాలం కోర్టు కేసుఅడ్డుగా చెప్పిన కేసీఆర్ సర్కార్ కాలు కదపడం లేదు. జర్నలిస్టు సంఘాల నేతల్ని దొడ్లో కట్టేసుకున్న కేసీఆర్ తీరుపై జర్నలిస్టులు మండిపడుతున్నారు. నేతలూ మాట్లాడటం లేదని.. తమ స్థలాల సంగతేమిటని వారు మథన పడుతున్నారు.

ఎన్నో సార్లు అరచేతిలో వైకుంఠం చూపిన కేసీఆర్, కేటీఆర్

హౌసింగ్ సొసైటీలో సభ్యులుగా సీనియర్ జర్నలిస్టులు. దాదాపుగా ఇరవై ఏళ్లకిందటే తలా రెండు లక్షలు చొప్పున కట్టి.. స్థలాలు వస్తాయని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వారిలో కొంత మంది చనిపోయారు కూడా. కేసీఆర్ వంచన ఈ స్థాయిలోఉంటుందని ఊహించలేకపోతున్నామని ఆ జర్నలిస్టులు వాపోతున్నారు. 2018 ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న సమయంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు సుప్రీంకోర్టులో ఉన్నాయి. మేం మళ్లీ గెలవగానే కోర్టులో కేసులు గెలవడానికి ప్రయత్నిస్తాం లేకపోతే.. వేరే స్థలం కేటాయిస్తామనికేసీఆర్ భరోసా ఇచ్చారు. జర్నలిస్టులు అంతా జై కేసీఆర్ అన్నారు. అంతకు ముందు కూడా ఇలా చాలా సార్లు చెప్పారు. కానీ కేసీఆర్ చెబితే నమ్మాల్సిందే కాబట్టి మరోసారి నమ్మారు. ఎప్పట్లాగే ఎన్నికల తర్వాత పట్టించుకోలేదు. ఆ తర్వాత మరోసారి జర్నలిస్టుల అవసరం పడినప్పుడు .. ఇదిగో స్థలం ఇచ్చేస్తున్నా.. ఫలానా స్థలం ఉంది చూసి రండి అని జర్నలిస్టు సంఘం నేతల్ని పంపారు. హమ్మయ్య కేసీఆర్ ఇచ్చేస్తున్నారని జర్నలిస్టు సంఘం నేతలు వెళ్లి స్థలం చూసి వచ్చారు. మళ్లీ మామూలే. పనైపోయిన తర్వాత పట్టించుకోలేదు. మధ్యలో కేటీఆర్ కూడా తాను జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా తీసుకుంటానని హామీ ఇచ్చారు. అన్నీ మర్చిపోయారు. ఆయనా మర్చిపోయారు. తండ్రీ కొడుకులు ఇద్దరూ ఇలా మోసం చేయడంతో జర్నలిస్టులంతా నమ్మడమే పాపం అనుకుంటున్నారు.

సుప్రీంకోర్టు క్లియర్ చేసినా స్థలాలు ఎందుకివ్వడం లేదు ?

సుప్రీంకోర్టు జర్నలిస్టుల స్థలం వారిది వారికి ఇచ్చేసినా ప్రభుత్వం ఎందుకివ్వడం లేదంటే.. ఇప్పుడు అత్యంత విలువైన స్థలాలు. వాటిలో కొన్ని టీఆర్ఎస్ నేతల కబ్జాల్లో ఉన్నాయనే అనుమానాలు ఉన్నాయి. కారణం ఏదైనా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై ఇచ్చిన మాటల్ని కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదు. అస్మదీయులకు కట్టబెట్టాలని కబ్జా చేసినవాళ్లకే అండగా ఉండేందుకు ప్రభుత్వ నిర్ణయించుకోవడంతో ఈ సమస్య వచ్చిందటున్నారు.

రిటైరయ్యే దశలో ఉన్న జర్నలిస్టుల వేదన అంతా ఇంతా కాదు !

20 ఏళ్ల కిందటే్ రెండు లక్షలు కట్టి ఇప్పటికీ వడ్డీలు కట్టుకుంటున్న వారు ఉన్నారు. అలాంటి వారు ప్రభుత్వ స్థలం ఇస్తుందని ఇప్పటికీ ఆశలు పెట్టుకున్నారు. ఎక్కువ మంది రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్నారు. ప్రభుత్వం మాట తప్పకపోతేఓ గూడు ఉంటుందని ఆశ పడుతున్నారు. కానీ కేసీఆర్ మోసానికి వారు బలైపోతున్నారు.