దళితుల్నీ వదలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు – కేసీఆర్ హెచ్చరికల్నీ కూడా పట్టించుకోరా ?

దళిత బంధు నిధులను కూడా దళితుల నుంచి వదిలి పెట్టకుండా నొక్కేస్తున్నారని కేసీఆర్.. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఫైరయ్యారు. టీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా బీార్ఎస్ ప్లీనరీ నిర్వహించిన ఆయన… ఎమ్మెల్యేల తీరుపై ఫైర్ ్యాయరు. దళిత బంధు పథకం డబ్బుల విషయంలో కొందరు అవినీతికి పాల్పడినట్లు తన దగ్గర సమాచారం ఉందన్నారు. దళిత బంధు డబ్బుల్ని కొందరు ఎమ్మెల్యేలు నొక్కేస్తున్నారని సీఎం స్వయంగా అనడం … పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గత కార్యకవర్గ సమావేశంలోనే కేసీఆర్ ఈ పథకంలో దళితుల్ని పీడించే ఎమ్మెల్యేల సంగతి చూస్తానని హెచ్చరించారు. అయినా మారకపోడంతో మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.

కమిషన్ ఇచ్చిన వారికే దళిత బంధు పథకం నింద నిధులు

దళిత బంధు లబ్దిదారుల ఎంపిక పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల చేతుల్లో ఉంది. కలెక్టర్లు కూడా వారు చెప్పినట్లే వినాల్సి వస్తోంది. ఈ కారణంగా తమకు మూడు నుంచి నాలుగు లక్షలు కమిషన్ ఇస్తేనే లబ్దిదారులుగా ఎంపిక చేస్తున్నారు. దీనిపై రోజురోజుకు ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుండటంతో… పార్టీ మీటింగ్‌లో కేసీఆర్ మండిపడ్డారు. ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు. మీటింగ్ లో ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం. మరోసారి వసూళ్లకు పాల్పడితే.. టికెట్ కాదు. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడం ఖాయమన్నారు. ఇదే చివరి వార్నింగ్ అన్నారు సీఎం. ఆ ఎమ్మెల్యేల సంగతి తేలుస్తా అన్నారు సీఎం. తన దగ్గర పూర్తి సమాచారం ఉందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీకి ప్రజల వద్ద మంచి ఆదరణ ఉందని.. గతంలో కంటే మరిన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందన్న సీఎం… దళిత బంధు పథకంలో జరిగే అవినీతికి సంబంధించి ఎమ్మెల్యేలందరికి ఓ వార్నింగ్ ఇవ్వాలనుకున్నారు. కానీ కేసీఆర్ మాటలను ఎవరూ పట్టించుకోవడం లేదు.

గెలుపుపై అపనమ్మకంలో కేసీఆర్ !

పైకి వంద సీట్లు వస్తాయని చెబుతున్నా..కేసీఆర్ ఎమ్మెల్యేల తీరుపై గెలుపుపై పెద్దగా నమ్మకం పెట్టుకోలేకుండా ఉన్నారు. దాహమేసినప్పుడే బావి తవ్వుకునేలా వద్దని జనంలోకి వెళ్లాలని ఎమ్మలె్యేలకు చెబుతున్నారు. మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండోసారి జరిగిన ఎన్నికల్లో 88 సీట్లు సాధించామ‌ని, వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు ప‌క్కాగా గెలుస్తామ‌ని మనదగ్గరో సర్వే ఉందని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఆ మాటల్లో కాన్ఫిడెన్స్ కనిపించలేదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఎందుకంటే నియోజకవర్గాల వారీగా ఇద్దరు నాయకులు బాధ్యతలు తీసుకోవాలని ..పల్లెనిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలని నేతలకు పిలుపునిచచ్ారు. నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ చేపట్టాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలే గెలిపించాలన్నట్లుగా ఆయన తీరు ఉందన్న అభిప్రాయం వ్యక్తమయింది.

బీఆర్ఎస్‌లో పెద్దగా కనిపించని ఉత్సాహం

బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ప్లీనరీ .. ప్రతినిధుల సభను ప్రతీ సారి భారీగా నిర్వహిస్తారు. పెద్ద విందు ఇచ్చేవారు. కానీ ఈ సారి చాలా సాదాసీదాగా నిర్వహించారు. తెలంగాణ భవన్ లో సమావేశం నిర్వహించడం ద్వారా.. మ మ అనిపించారు. నిజానికి బీఆర్ఎస్ ఆవిర్భావం వేరు.. టీఆర్ఎస్ ఆవిర్భావం వేరు. అయినా .. టీఆర్ఎస్ ను మర్చిపోలేని పరిస్థితి . చివరికి ఈ సమావేశంద్వారా ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని సందేశాన్ని మాత్రం కేసీఆర్ బయటకు పంపారని ఆ పార్టీ క్యాడర్ నిట్టూర్పు విడుస్తున్నారు.