తెలంగాణలో బీజేపీని ఎదుర్కోవాలని భారత రాష్ట్ర సమితి నేతలు అనుసరిస్తున్న వ్యూహాలు ఆశ్చర్యకరంగా కనిపిస్తున్నాయన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. బీజేపీపై ప్రజల్లో అనేక రకాల ఆరోపణలు చేసి .. ప్రజల్లో వ్యతిరేకత పెంచాలనుకుంటున్నారు. అయితే ఇలాంటి వ్యతిరేక ప్రచారాల్లో కాస్తంత నిజం ఉన్నా ప్రజలు నమ్ముతారేమో కానీ పూర్తి స్థాయి ఫేక్ ప్రచారాలే చేస్తున్నారు. ప్రధానంగా కేంద్ర సంస్థల ప్రైవేటీకరణ విషయంలో బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు నవ్వుల పాలవుతున్నాయి. నిన్నా మొన్నటిదాకా సింగరేణి అన్నారు… స్టీల్ ప్లాంట్ అన్నారు. తాజాగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అంటున్నారు. కానీ ఏ వాదనలోనూ నిజం లేదని ఎప్పటికప్పుడు తేలిపోతోంది.
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రతిపాదనే లేదు కానీ ఫేక్ ప్రచారం !
తెలంగాణలోని ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది. అది భారత రక్షణావసరాల కోసం ఏర్పాటు చేసిన సంస్థ. ఇతర దేశాలకు కూడా అక్కడ తయారయ్యే ఆయుధాలు అమ్ముతుంటారు. రక్షణ ట్యాంకుల నిర్మాణంలో కీలకం. అసలు ఆ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలన్న ప్రతిపాదనే లేదు. కానీ హరీష్ రావు ప్రైవేటీకరణ చేయవద్దని లేఖ రాశారు. ఎందుకంటే కార్మిక సంఘాలు తన వద్దకు వచ్చి చెప్పాలంటే. ప్రైవేటీకరణ చేస్తారేమో.. చేయవద్దని పోరాడండి అని అడగడంతో ఆయన లేఖ రాశారట. రాజకీయం కోసం వారు ఉద్యోగుల జీవితాలో ఎలా ఆడుకుంటారో ఈ ఘటనతో స్పష్టమవుతోందని భావిస్తున్నారు.
స్టీల్ ప్లాంట్ పై అదే ప్రచారం !
స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఇంత వరకూ ఎలాంటిప్రక్రియ ప్రారంభం కాలేదు. కానీ మూలధనం ఇస్తామంటూ హడావుడి చేసి..బిడ్డింగ్ వేస్తామంటూ ప్రచారం చేసుకుని చివరికి వెనక్కి తగ్గారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో.. ఆ విమర్శల నుంచి దృష్టి మళ్లించేందుకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వ్యవహారం తెరపైకి తెచ్చారు. కానీ ప్రజలకు ఏమీ తెలియదని కాదుగా. కేంద్రం డిజిన్వెస్ట్ మెంట్ ను ఓ పద్దతిగా చేస్తుంది. గతంలోలా ఇప్పుడు వ్యాపార వ్యవహారాలు లేవు. ప్రపంచీకరణ ప్రభావంతో ప్రభుత్వ సంస్థలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. వాటిని నిలబెట్టాలంటే సంస్కరణలు అమలు చేయాలి. ఆ ప్రయత్నాలను కూడా తప్పు పడుతూ వాటిని నిండా ముంచే పనులు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
సింగేరణిని ముంచుతోంది బీఆర్ఎస్.. కానీ నింద మాత్రం బీజేపీపై !
సింగరేణిలో మెజార్టీ వాటా బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. ఎలాంటి నిర్ణయం అయినా తెలంగాణ ప్రభుత్వమే తీసుకుటుంది. చివరికి కార్మికులకు బోనస్ ప్రకటించేది.. కారుణ్య నియమకాలు చేసేది కూడా కేసీఆర్ ప్రభుత్వమే . సీఎండీని కూడా తెలంగాణ ప్రభుత్వమే. అయినా.. సింగరేణిని ప్రైవేటీకరణ చేసేది కేంద్రం అని ఆరోపిస్తూ రచ్చ చేస్తూ ఉంటారు. గనుల్ని అడ్డగోలుగా దోచి పెట్టకుండా.. వేలంలో పాల్గొనమని మాత్రం కేంద్రం చెప్పింది. కానీ వేలంలో పాల్గొనకుండా చేయాల్సిన షో అంతా బీఆర్ఎస్ చేస్తోంది. ప్రజల ముందు చులకన అవుతోంది. కానీ ఈ ఫేక్ రాజకీయాల్ని మాత్రం ఆపడం లేదు.