గవర్నర్ వద్ద పెండింగ్ బిల్లులపై సుప్రీం ని ఆశ్రయించిన ప్రభుత్వం

రాజ్‌భవన్‌, ప్రగతిభవన్‌ మధ్య వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. గవర్నర్‌ బిల్లులు ఆమోదించకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిటిషన్ దాఖలు చేయగా.. గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. గవర్నర్ మొత్తం పది బిల్లులు ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు. సెప్టెంబర్ నెల నుంచి 7 బిల్లులు, గత నెల నుంచి 3 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని న్యాయస్థానానికి వివరించింది. రాజ్యాంగబద్దంగా ఎన్నికైన ప్రభుత్వం ఉభయ సభల్లో ఆమోదించుకున్న బిల్లులను పెండింగ్‌లో పెట్టడం సబబుకాదని వెంటనే గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరింది.

ఇవీ పెండింగ్‌లో ఉన్న బిల్లుల వివరాలు..

తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు

ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను అటవీ విశ్వవిద్యాలయంగా మార్చే బిల్లు

అజామాబాద్‌ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ బిల్లు

పురపాలక నిబంధనల చట్ట సవరణ బిల్లు

పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ చట్ట సవరణ

ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు

మోటార్‌ వాహనాల పన్ను చట్ట సవరణ బిల్లు

పురపాలక చట్ట సవరణ బిల్లు9. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు

వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లు