నిన్న మోదీ, నేడు జై శంకర్కచ్చతీవుపై కాంగ్రెస్ ను ఉతికి ఆరేసిన వైనం

కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు.. దేశం పుట్టినప్పటి నుంచి ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉంది . ఆత్మగౌరవ ఉద్యమానికి పట్టుకొమ్మగా నిలిచిన తమిళనాడును కూడా కొన్ని విషయాల్లో కాంగ్రెస్ క్రుంగతీసింది. కాంగ్రెస్ తన తాత్కాలిక ప్రయోజనాలే కానీ దేశ విశాల దృక్పధం, శాశ్వత ప్రయోజనాల గురించి ఆలోచించిన దాఖలాలు లేనేలేవు. శ్రీలంకకు భారత ప్రభుత్వం ధారాదత్తం చేసిన కచ్చతీవు విషయంలోనూ అదే జరిగింది. చోద్యం ఏమిటంటే అప్పట్లో కాంగ్రెస్ చర్యలకు డీఎంకే కూడా వత్తాసు పలికింది….

కచ్చతీవును గుర్తిచేసిన ప్రధాని మోదీ..

తమిళనాట ఎన్నికల ప్రచారం ఉచ్చఘట్టానికి చేరుకుంది. నేతల మధ్య మాటల తూటులు పేలుతున్నాయి. అత్యధిక స్థానాలను గెలుచునేందుకు డీఎంకే, కాంగ్రెస్ సహిత యూపీఏ ప్రయత్నిస్తోంది. వారిని నిలువరించి ఎక్కువ సీట్లు సంపాదించేందుకు బీజేపీ నేతృత్వ ఎన్డీయే కంకణం కట్టుకుంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ కూడా తమిళనాడుపై ప్రత్యేక ఫోకస్ పెట్టి పర్యటనలు జరుపుతున్నారు. ఆదివారం జరిగిన ఓ సభలో మోదీ…. సుదీర్ఘకాలం వివాదంగా కొనసాగుతున్న కచ్చతీవు (కచ్చదీవి) వ్యవహారాన్ని ప్రస్తావించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చినప్పుడు కచ్చతీవు మన దగ్గరే ఉంది. శ్రీలంక, తమిళనాడు మధ్య ఉన్న ఆ దీవి భద్రతా పరంగా కీలకమైంది. కానీ కాంగ్రెస్‌ నాలుగైదు దశాబ్దాల కిందట ఆ ద్వీపం ఎందుకూ పనికిరాదంటూ శ్రీలంకకు ఇచ్చేసింది. ఆ మూల్యం ఇప్పటికీ చెల్లించుకుంటున్నాం. తమిళనాడు మత్స్యకారులు ఆ ద్వీపం వైపు వెళ్లినపుడు లంక అధికారులు అరెస్టు చేస్తున్నారు. బోట్లను జప్తు చేస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తుకట్టిన డీఎంకే లాంటి పార్టీలు కూడా ఈ అంశంపై నోరెత్తడం లేదు’’ అని మోదీ పేర్కొన్నారు.

కాంగ్రెస్ తీరును ఎండగట్టిన ప్రధాని

బహిరంగ సభ ప్రసంగంలో మోదీ కచ్చతీవు వ్యవహారాన్ని వదిలిపెట్టలేదు. ఎక్స్ వేదికగా కూడా స్పందించారు. కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా కచ్చతీవును వదులుకున్న కొత్త వాస్తవాలు కళ్లు తెరిపించాయని ఆయన అన్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆర్టీఐ కింద దరఖాస్తు ద్వారా సేకరించిన ఈ సమాచారాన్ని ఒక ఆంగ్ల దినపత్రిక ఆదివారం ప్రచురించింది. కచ్చతీవును శ్రీలంకకు అప్పగించడంలో కాంగ్రెస్‌, డీఎంకే ఎలా కుమ్మక్కయ్యాయో ఆ ఆంగ్ల పత్రిక స్పష్టం చేసిందని అన్నామలై ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ఆ దీవిని పొరుగుదేశానికి అప్పగిస్తూ 1974లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. నాడు కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయం వల్లే ఇప్పుడు తమిళనాడు జాలర్లు తమ రాష్ట్రానికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ దీవి వద్ద చేపల వేటకు వెళ్లి శ్రీలంక నేవీ చేతిలో అరెస్టవుతున్నారని బీజేపీ ఆక్షేపించింది.

మరిన్ని వివరాలు అందించిన జై శంకర్ ….

పదేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వం కచ్చతీవును వెనక్కి తీసుకోకుండా ఏం చేసిందంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అర్థం లేని ప్రశ్న వేశారు. అది ఎంత సంక్లష్టమైన ప్రశ్నో చెబుతూ విదేశాంగ మంత్రి జై శంకర్ గట్టి క్లాసే తీసుకున్నారు. కచ్చతీవు వ్యవహారం ఇప్పటికిప్పుడు తెరపైకి వచ్చింది కాదని దీనిపై కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయని చెప్పారు. తాను మాత్రమే ఈ విషయంపై 21 సార్లు తమిళనాడు సీఎంకు సమాధానమిచ్చానని గుర్తుచేశారు. మాజీ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ దృష్టిలో ఇది చిన్న ద్వీపం. దీనికి ప్రాముఖ్యతే లేదని భావించి.. వదిలించుకోవాలనుకున్నారు. ఇందిరాగాంధీ కూడా ఇదే అభిప్రాయంతో నిర్ణయాలు తీసుకున్నారు అని మంత్రి వ్యాఖ్యానించారు