రైటర్ పద్మభూషణ్ చేతిలో అరడజను సినిమాలు..సుహాస్ జోరు మామూలుగా లేదు!

కమెడియన్లు హీరోగా మారడం తెలుగు ఇండస్ట్రీలో కొత్తేంకాదు కానీ..వారిలో నిలదొక్కుకునేవారి సంఖ్య తక్కువే. కొన్నాళ్లు హీరోగా ట్రై చేసినా ఆ తర్వాత మళ్లీ రూటుమార్చాల్సిందే. ఇందుకు భిన్నంగా కెరీర్లో దూసుకెళుతున్నాడు సుహాస్.

సహాస్ అంటే మీకు వెంటనే ఎవరో అర్థం కాకపోవచ్చు కానీ ‘కలర్ ఫొటో’ హీరో అంటే ఠక్కున గుర్తొస్తాడు. షార్ట్ ఫిలిమ్స్ తో ఇండస్ట్రీలోకి వచ్చిన సుహాస్ కెరీర్ మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసేవాడు. ‘కలర్ ఫోటో’ సినిమా తన కెరీర్ని మార్చేసింది. ఈ సినిమాతో తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్న సుహాస్ హీరోగా వరుస ప్రాజెక్టులు చేస్తున్నాడు. రీసెంట్ మూవీ ‘రైటర్ పద్మభూషణ్’ కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది. 3 కోట్లతో తీసిన ఈ సినిమా 10 కోట్లు వసూలు చేసింది. హీరో ఎవరైనా కానీ మంచి కథను తెరకెక్కిస్తే లాభాలు పొందడం పెద్ద కష్టమేం కాదని నిరూపించింది ఈ మూవీ. అడవి శేష్ హీరోగా నటించిన ‘హిట్ 2’ లో నెగిటివ్ రోల్ లో కూడా ఇరగదీశాడు. అంటే కేవలం హీరోగా మాత్రమే కాదు పాత్ర ఏదైనా కానీ దానికి ఇంపార్టెన్స్ ఉంటేచాలు చేసుకుపోతున్నాడు. మరి వాట్ నెక్స్ట్ సుహాస్ అంటే…ప్రస్తుతం తన చేతిలో అరడజను ప్రాజెక్టులున్నాయట…

సుహాస్ చేతిలో 6 సినిమాలు
రీసెంట్ గా పుట్టినరోజు జరుపుకున్నాడు సుహాస్. ఈ సందర్భంగా తను నటిస్తున్న మూవీస్ నుంచి పోస్టర్స్ రిలీజ్ చేశారు ఆయా మూవీ మేకర్స్. అది చూసి ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతైంది. సుహాస్ చేతిలో ఆరు సినిమాలున్నాయా..జోరు మామూలుగా లేదు అనుకుంటున్నారు. ప్రస్తుతం
సుహాస్ చేతిలో ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’, ‘ప్రసన్న వదనం’, ‘ఆనందరావు అడ్వంచర్స్’, ‘కేబుల్ రెడ్డి’, ‘గొర్రె పురాణం’,’ శ్రీరంగ నీతులు’..సినిమాలున్నాయి. ఇందులో ప్రతి టైటిల్ ఆసక్తికరంగా ఉన్నాయి. పైగా కథల ఎంపికలో సుహాస్ స్టైలే వేరు..కథ తన చుట్టూనే తిరగాలని అస్సలు అనుకోడు అందుకే మంచి మంచి కథలకు ఫస్ట్ ఛాయిస్ గా మారుతున్నాడు. ఇవే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మరో 10 సినిమాలున్నాయి. మొత్తానికి సుహాస్ చాలా బిజీ. ఈ సినిమాలన్నీ హిట్టైతే..హీరోగా మారిన కమెడియన్ గా ఓ రికార్డ్ క్రియేట్ చేసినట్టే.