మహిళాభ్యుదయం – అదే మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వ ధ్యేయం

ఆ పార్టీకి ఎన్నికలతో సంబంధం లేదు. అభివృద్ధి, సంక్షమం అనేవి ఆ పార్టీ నాణెనికి రెండు వైపుల లాంటివి. నిత్యం జనం కోసం పరితపించే పార్టీ అది. అదే భారతీయ జనతాపార్టీ. మధ్యప్రదేశ్ బీజేపీ ఇప్పుడు మహిళల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వారి సంక్షేమానికి కృషి చేసే ఏకైక పార్టీ అన్న పేరు తెచ్చుకుంటోంది.

లాడ్లీ బెహన్ యోజనలో అదనంగా రూ. 250

మధ్యప్రదేశ్లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం లాడ్లీ బెహన్ యోజనలో ప్రతి నెల రూ.1,000 రూపాయలు మహిళల ఖాతాలో వేస్తోంది. మొత్తం 1.25 కోట్ల మంది మహిళలకు ఆ స్కీము కింద వారి ఖాతాల్లో డబ్బు జమ అవుతోంది. రాఖీ పండుగ సందర్భంగా శివరాజ్ చౌహాన్ ఓ ప్రకటన చేశారు. లాడ్లీ బెహన్‌కు రాఖీ బహుమతిగా అదనంగా రూ. 250 అందిస్తున్నట్లు చెప్పి వెంటనే బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ నిర్ణయం కారణంగా రాష్ట్రప్రభుత్వానికి రూ. 400 కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ మహిళా సంక్షేమం దృష్ట్యా దాన్ని అమలు చేస్తున్నామన్నారు పైగా ఉత్తరాదిన కూడా ఇదీ శ్రావణమాసమని ఆయన గుర్తుచేశారు. మహిళల ఖాతాలో రూ. 1,250 జమ చేసే పద్ధతి ఇకపై కొనసాగుతుందని బీజేపీ ప్రకటించింది. పైగా త్వరలోనే మహిళకు ఈ స్కీము కింద జమ చేసే సొమ్మును రూ. 3,000కు పెంచుతామన్నారు. జూన్ 10న లాడ్లీ బెహన్ యోజన ప్రారంభించినప్పటి నుంచి ఇంతవరకు రూ.3,,628 కోట్ల రూపాయలు మహిళల ఖాతాలో వేశారు. రూ.2.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాల మహిళలకు లాడ్లీ బెహన్ యోజన కింద నగదు అందుకునే అవకాశం ఇచ్చారు. విద్యుత్ ఛార్జీలు చెల్లించమని ఆ శాఖ ఇకపై వత్తిడి చేయదని కూడా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. పేద మహిళలకు కరెంట్ బిల్లు రూ. 100కు మించకుండా చూసుకునే ప్రక్రియకు కూడా శ్రీకారం చుడుతున్నామన్నారు.

రూ. 450కే గ్యాస్ సిలెండర్..
శ్రావణ మాసంలో మహిళలకు ముఖ్యమంత్రి మరో గిఫ్ట్ ప్రకటించారు. రూ. 450కే వారికి గ్యాస్ సిలెండర్ అందిస్తామన్నారు. అయితే అది ఈ ఒక్క నెలకేనా అలా కొనసాగిస్తారా అన్నది మాత్రం స్పష్టం కాలేదు. మహిళల సామాజిక పరిస్థితులను మెరుగు పరిచేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు శివరాజ్ ప్రభుత్వం ప్రకటించింది

ఉద్యోగాల్లో మహిళల కోటా పెంపు
ప్రభుత్వోద్యోగాల్లో మహహిళల కోటాను 30 నుంచి 35 శాతానికి పెంచుతున్నట్లు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసి శివరాజ్ సింగ్ చౌహాన్ వారి కళ్లలో ఆనందాన్ని చూశారు. టీచర్ రిక్రూట్మెంట్‌లో ఈ రిజర్వేషన్‌ 50 శాతంగా ఉంటుంది. చిన్న పరిశ్రమలు, సంస్థలు ప్రారంభించే మహిళలకు పారిశ్రామిక వాడల్లో భూములను ఉచితంగా అందిస్తారు. వారికి నెలకు కనీసం రూ. 10 వేలు ఆదాయం వచ్చేట్టుగా చూస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళలకు స్థలాలిస్తారు. ఈ స్కీములన్నింటినీ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. బీజేపీ ఇన్ని రోజులు పాలించిన తర్వాత కూడా భయంతో పథకాలు అమలు చేస్తోందని మాజీ సీఎం కమల్‌నాథ్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని బీజేపీ భావిస్తోంది. తాము ఆచరణ యోగ్యమైన హామీలు మాత్రమే ఇస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ అసాధ్యమైన హామీలిస్తూ ఖజానా ఖాళీ చేస్తోందని బీజేపీ ఎదురుదాడికి దిగుతోంది