గాయత్రీ మంత్రం శక్తివంతమైనది అని ఎందుకంటారు!

గాయత్రి మంత్రం కేవలం ఆధ్యాత్మిక సాధకులకు మాత్రమే కాదు ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచేందుకు కూడా సహాయపడుతుందా? ఇందులో ప్రతి అక్షరం వెనుకున్న పరమార్థం ఏంటి? గాయత్రి మంత్రం ఎందుకంత పవర్ ఫుల్ తెలుసుకుందాం…

గాయత్రి మంత్రం
ఓం భూర్భువః సువః తత్ సవితుర్వ రేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్”

ఈ మంత్రం మొత్తం బీజాక్షర మయం. ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తే సకల దేవతలను ప్రార్థించినట్లేనని రుగ్వేదంలో పేర్కొన్నారు. నిర్ధిష్ఠమైన పద్ధతిలో ఈ మంత్రాన్ని జపించినా, విన్నా..వెలువడే ధ్వనితరంగాలు శరీరాన్ని ఉత్తేజపరుస్తాయి. ఇది ప్రయోగాత్మకంగా నిరూపితమైంది కూడా.
ఈ మంత్రం జపించడం వల్ల అనుకూల ఆలోచనలు, ఆత్మవిశ్వాసం స్థాయి కూడా పెరుగుతాయని తేల్చారు. ఈ మంత్రం ఉచ్ఛారణ ద్వారా నవనాడుల ద్వారా శరీరం మొత్తం వ్యాపించి ఏడు చక్రాలపైనా ఈ ప్రభావం పడి ఆ చక్రాలు ఉత్తేజితమవుతాయంటారు. నిత్యం ఈ మంత్రం స్మరిస్తే ఏ పని తలపెట్టినా విజయం సొంతం చేసుకుంటారని పురాణాల్లో పేర్కొన్నారు.

గాయత్రీ మంత్రం జపించే సమయంలో శరీరంలో జాగృతం అయ్యే గ్రంధులివే..మీరు కూడా మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ గమనించవచ్చు…
ఓం- శిరస్సు పైన సుమారు ఆరు అంగుళాలు
భూ:- కుడి కన్ను పైన 4 అంగుళాలు
భువః -మూడో నేత్రం పైనున్న 3 అంగుళాలు
స్వ: – ఎడమ కన్ను పైనున్న 4 అంగుళాలు

మంత్రంలో ఉన్న 24 అక్షరాలు శరీరంలో ఉన్న 24 గ్రంధులను ఉత్తేజితం చేస్తాయి. ఆ గ్రంధులేంటి-అవి శరీరంలో ఏ స్థానంలో ఉంటాయో ఇక్కడ ప్రస్తావించాం.

అక్షరం – గ్రంధి పేరు -శరీరంలో అవి ఉండే కేంద్రం

  1. తత్ – తాపీని – ఆజ్ఞాచక్రము
  2. స – సఫలత – ఎడమకన్ను
  3. వి – విశ్వ – కుడికన్ను
  4. తు: – తుష్టి – ఎడమ చెవి
    5 వ – వరద – కుడిచెవి
  5. రే – రేవతి – నాసికా
  6. ణి – సూక్ష్మ – పై పెదవి
  7. యం – జ్ఞాన – క్రింది పెదవి
  8. భర్ – భర్త – కంఠము
    10 గో – గోమతి – కంఠ కూపము
  9. దే – దేవిక – ఎడమ ఛాతి
  10. వ – వరాహి – కుడిఛాతీ
  11. స్య – సింహని – ఉదరము పైన చివరి
  12. ధీ – ధ్యాన – కాలేయము
  13. మ – మర్యా ద – ప్లీహ్యము
  14. హి – మూలము – నాభి
  15. ది – మేధ – వెన్నుపూస చివరి భాగము
  16. యో – యోగమాయ -ఎడమ భుజము
  17. యో – యోగిని – కుడి భుజము
  18. నః – ధారిణీ – కుడి మోచేయి
  19. ప్ర – పభవ – ఎడమ మోచేయి ఆగ్ర భాగం
  20. చో – ఉష్మ – కుడి మణికట్టు
  21. ద – దృశ్య – కుడి అర చేయి అగ్రభాగం
    24.యాత్ – నిరంజన – ఎడమ అరచేయి

ఈ 24 అక్షరాలలో 24 దేవతమూర్తుల శక్తి అంతర్లీనంగా ఉందని చెబుతారు. అందుకే గాయత్రి మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా జపించటం వలన ఆ ఇరవైనాలుగు మంది దేవతల ఆశీస్సులు లభిస్తాయంటారు పండితులు.

గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.