హిందూపురంలో దూకుడు – ప్రజాపోరుతో బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్తున్న విష్ణువర్ధన్ రెడ్డి !

హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో భారతీయ జనతా పార్టీ నేతలు కదం తొక్కుతున్నారు. రాష్ట్రంలో మిగతా చోట్ల లేని విధంగా ప్రభుత్వంపై ప్రజాపోరు నిర్వహిస్తున్నారు. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీని బలోపేతం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి బీజేపీ ఎంపీ పార్లమెంట్ కు వెళ్లాలన్న పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు. బీజేపీ హైకమాండ్ చాన్సిస్తే తానే పోటీ చేయాలనుకుంటున్నారు. అందు కోసం విస్తృతంగా శ్రమిస్తున్నారు.

మూడు దశాబ్దాలుగా బీజేపీలో పదవులు ఆశించకుండా పని

విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీలో మూడు దశాబ్దాలుగా పదవులు ఆశించకుండా పని చేస్తున్నారు. బీజేపీని బలోపేతం చేయడమే తన జీవిత లక్ష్యంగ ాపని చేస్తూ వస్తున్నారు. ఆయన పని తీరు.. నాయకత్వ లక్షణాలతో వేగంగా ఎదిగారు. జాతీయస్థాయిలో ఎలాంటి పనిని అప్పగించినా సమర్థంగా చేసి వచ్చే నేతగా గుర్తింపు పొందారు. రాష్ట్ర, జాతీయస్థాయిలో పార్టీకి సేవలు అందించేందుకు బిజీగా ఉండేవారు. ఈ కారణంగా గతంలోహిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పార్టీ కార్యక్రమాలకు తక్కువ సమయం కేటాయించేవారు. కానీ ఇప్పుడు హిందూపురం నుంచి బీజేపీ పార్లమెంట్ కు వెళ్లాలన్న లక్ష్యంతో ఏడాదిగా పూర్తిగా హిందూపురంపైనే దృష్టి పెట్టారు.

ఏడాదిగా ప్రజా సమస్యలపై పోరాటం

ఏడాదిగా హిందూపురంలో వరుసగా ఉద్యమాలు చేశారు. బీజేపీ క్యాడర్ అంతా యాక్టివ్ అయ్యేలా చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఎంత స్థాయిలో అంటే… ఐదేళ్లలో కనీస మేలు చేయాలేదన్న భావనలో ఉన్నారు. ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న దానికి గ్రౌండ్ రియాలిటీకి తేడా ఉందని అనుకుంటున్నారు. ఈ విషయాన్ని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తించారు. అయితే వారికి అండగా ఉండేందుకు ఇతర ప్రతిపక్షాలు సమర్థంగా ముందుకు రాలేకపోయాయి. ఈ లోటును గుర్తించి వారి కోసం రంగంలోకి దిగి వారి కోసం పోరాడి అభిమానాన్ని పొందారు. ప్రజాసమస్యలపై పోరాటంలో ప్రజల నుంచి బీజేపీకి వస్తున్న మద్దతే దీనికి సాక్ష్యమని బూీజేపీ నేతలు చెబుతున్నారు.

క్రమంగా బలపడిన బీజేపీ

ప్రజాపోరాటాలు చేస్తే .. వాటికి ప్రజలమద్దతు లభిస్తే.. పార్టీలు బలపడతాయి. దానికి బీజేపీ బలపడటం ఉదాహరణగా కనిపిస్తోంది. బీజేపీ ఇప్పుడు హిందూపురం నియోజకవర్గంలో క్రమంగా బలపడుతోంది. ప్రతీ గ్రామం నుంచి బీజేపీ సానుభూతిపరులు బయటకు వస్తున్నారు. ప్రజల్లోకి వచ్చి మరింతగా పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. వీరి రాకపోతే బీజేపీ బలపడింది. ఇప్పుడు ప్రధాన పార్టీలకు గట్టిపోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. పార్టీని ఈ స్థాయిలో బలోపేతం చేసిన విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీగా నిలబడితే.. సరైన ఫలితం వస్తుందన్న అంచనా బీజేపీ అగ్రనేతల్లో ఉన్నట్లుగా కనిపిస్తోంది .