చైనా పతాకాన్ని వాడి అడ్డంగా బుక్కయిన డీఎంకే…

అసలు కొన్ని పార్టీలకు దేశభక్తి ఉందా. వాళ్లు మనదేశంలోనే ఉంటున్నారా. దేశ సార్వభౌమాధికారం పట్ల వాళ్లు గౌరవమర్యాదలను ఒక్కసారైనా ప్రదర్శించారా…అసలు వాళ్లు ఈ దేశంలోనే ఉన్నారా.. అన్న ప్రశ్నలు తరచూ తలెత్తుంటాయి. ఎందుకంటే ఆయా పార్టీల ప్రవర్తన అలా ఉంటుంది. అందులో తమిళనాడు అధికారపార్టీ డీఎంకే కూడా ఒకటే. తాము వేరే తమిళ దేశం కోరుకుంటున్నట్లు పూర్వం డీఎంకే నేతలు ప్రకటించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తప్పులో కాలేశారో, పొరబాటు జరిగిందో కానీ డీఎంకే నేతలు ఇండియాను వదిలి చైనా పక్షం వహిస్తున్నట్లుగా కనిపిస్తోంది….

డీఎంకే ప్రకటనలో చైనా జెండా..

తమిళనాడులోని కులశేఖరపట్టిణంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కేంద్రం ఏర్పాటైంది. రాకెట్ ప్రయోగ కేంద్రం (సెకెండ్ లాంఛ్ ప్యాడ్) ప్రారంభిస్తున్న సందర్భంగా డీఎంకేకు చెందిన పశుసంవర్థక శాఖామంత్రి అనితా రాధాకృష్ణన్ అన్ని పత్రికల్లో ఒక ప్రకటన ఇచ్చారు. ఈ ప్రాజెక్టును తమిళనాడుకు తీసుకురావడం వెనుక డీఎంకే శ్రమను వివరిస్తూ ఇచ్చిన ప్రకటనలో మోదీ, స్టాలిన్ ఫోటోలు ఉన్నప్పటికీ అక్కడ భారత పతాకం ఉండాల్సిన చోట చైనా మ్యాప్ ముద్రించారు.అది కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది..

తమిళ పార్టీని చించేసిన ప్రధాని

పత్రికా ప్రకటన వ్యవహారం ప్రధాని మోదీ దృష్టికి వెళ్లడంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. డీఎంకే తీరుపై అసహనం వ్యక్తం చేశారు. డీఎంకే ప్రజల కోసం పనిచేయదని, తప్పుడు పరపతి కోసం పాకులాడుతుందని ఆయన ఆరోపించారు. ఇస్రో లాంఛ్ ప్యాడ్ పై చైనా స్టిక్కర్ అంటించి తమ నైజాన్ని ప్రదర్శించారు. అంతరిక్ష రంగంలో భారత ప్రగతిని గుర్తించేందుకు వాళ్లు ఇష్టపడటం లేదని ఆయన వ్యాఖ్యానించారు. డీఎంకే నేతలు మన శాస్త్రవేత్తలను, అంతరిక్ష రంగాన్ని అవమానపరిచారని ప్రధాని అన్నారు..

క్షమాపణ చెప్పని డీఎంకే నేతలు

నిజానికి మంత్రి అనితా రాధాకృష్ణన్ వ్యక్తిగతంగా ఆ ప్రకటన ఇచ్చారు. అయితే ఆయన డీఎంకే నేతగానే అందులో ముద్రించి ఉన్నందున పార్టీ కూడా బాధ్యత వహిస్తుంది. వ్యవహారం వివాదంగా మారినప్పటి నుంచి రాధాకృష్ణన్ బయట కనిపించడం లేదు. సీఎం స్టాలిన్ సోదరి కణిమొళి ప్రాతినిధ్యం వహించే తుత్తుకుడి లోక్ సభా స్థానం పరిధిలోకి ప్రస్తుత రాకెట్ కేంద్రం వస్తుంది. దానితో ఆమె చాలా నింపాదిగా స్పందించారు. ముద్రించిన సంస్థ పొరబాటు చేసిందని, దానికే బీజేపీ వాళ్లు రాద్ధాంతం చేస్తున్నారని కణిమొళి ఎదురుదాడికి దిగారు.అయితే బీజేపీ తమిళనాడు శాఖాధ్యక్షుడు అన్నామలై .. డీఎంకే వారిని సూటిగా ఒక ప్రశ్న అడిగారు. పొరబాటే చేసి ఉంటే తప్పు జరిగిందని ఒప్పుకుని క్షమాపణ ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. దానికి డీఎంకే వైపు నుంచి సమాధాం రాలేదు..